తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ విషయంలో పోరాటం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నా సరే కొంత మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు పెద్ద స్థాయిలో సహకారం అందించడం అదేవిధంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలను అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు వివరించకపోవడం అనేది సీఎం కేసీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న ఇంకా చెప్పాలి. తెలంగాణలో పార్టీ కార్యకర్తలు ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదనే ప్రచారం ఇతర పార్టీల ఎక్కువగా చేస్తున్నాయి.

కాబట్టి వీటన్నింటిని అంచనా వేసుకునే సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లాల్సి ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల సహకారం లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. చాలా వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు ప్రధాన ఇబ్బంది గా మారారని పార్టీ వ్యవహారాల మీద కనీస అవగాహన లేకుండా కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని దీనివల్ల టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకత్వం కూడా కాస్త ఒత్తిడికి గురవుతోంది అంటున్నారు.

రాజకీయంగా పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఈ మధ్య కాలంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటమే కాకుండా భారతీయ జనతా పార్టీతో స్నేహం చేస్తూ ఇతర పార్టీల్లో మంచి పదవులు దక్కితే వెళ్లి పోవడానికి ప్రయత్నాలు చేయడం పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్న అంశం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది కీలక నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు దూకుడుగా ముందుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయక పోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది పెద్ద సమస్యగానే చెప్పాలి. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr