ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యవహారాల మీద అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారాలు మీద పట్టు కోల్పోయిన విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బాగా వేధిస్తున్న అంశం. రాజకీయంగా పార్టీ బలంగా ఉన్నా సరే మంత్రులు సమర్థవంతంగా పని చేయకపోవడం ప్రజల్లోకి వెళ్లకపోవడం అలాగే పార్టీ కార్యకర్తలతో సమాచారం తెప్పించుకుని ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏపీలో అధికార పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. రాజకీయంగా చాలా మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో బలంగా ఉండటంతో ప్రభుత్వ వ్యవహారాలు మీద పెద్దగా దృష్టి పెట్టడంలేదు.

ప్రస్తుతం పార్టీలో ఉన్న చాలా మంది మంత్రులు ప్రభుత్వ వ్యవహారాలు మీద పట్టు కోల్పోవడంతో జగన్ కొంతమంది మీద అధికారుల వద్ద నుంచి ఫిర్యాదులు కూడా అందుకున్నారని అలాగే అధికారుల నుంచి కూడా కొంత సమాచారం తెప్పించుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అని విమర్శలు చేస్తున్న సరే సైలెంట్గా ఉన్న మంత్రుల మీద జగన్ ఎక్కువ గురు పెట్టారని త్వరలోనే కొంతమంది మంత్రులకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన కూడా పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వైసిపి వర్గాలు అంటున్నాయి.

అదే విధంగా భారతీయ జనతా పార్టీతో స్నేహం చేయడం స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేయకపోవడం వంటివి కొంత మంది మంత్రులను ఇబ్బంది పెడుతున్నాయని అలాంటి మంత్రుల మీద కాస్త జగన్ ఎక్కువగా దృష్టి పెట్టడమే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులతో ఇతర ప్రాంతాల్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో స్నేహం చేసే వారిని క్యాబినెట్ నుంచి పంపడానికి ఇప్పటికే నివేదిక కూడా సిద్ధం చేసి వాళ్ళకి పంపించారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: