తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకొచ్చే దిశగా రేవంత్ పనిచేస్తున్నారు. ఒక వైపు బలమైన అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా పనిచేస్తూ..మరోవైపు బీజేపీకి కూడా చెక్ పెట్టి...కాంగ్రెస్‌ని పైకి తీసుకోచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ని ఈ సారి అధికార పీఠంలో కూర్చోబెట్టాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ నాయకత్వం, క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉందనే చెప్పాలి. బీజేపీ కంటే కాంగ్రెస్‌కు బాగా బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి...క్షేత్ర స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయడానికి కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గం కొడంగల్‌పై కూడా రేవంత్ ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో రేవంత్ మళ్ళీ కొడంగల్ బరిలో దిగడం ఖాయం.

గత ఎన్నికల్లో ఓటమికి టీఆర్ఎస్‌పై రివెంజ్ తీర్చుకోవాలని రేవంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మామూలుగా రేవంత్...రెండుసార్లు కొండగల్ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. 2009, 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు...కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చి 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ వ్యూహాల ముందు రేవంత్ చిత్తు అయ్యారు. ఆ వెంటనే రేవంత్...2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

ఇప్పుడు పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్...నెక్స్ట్ ఎన్నికల్లో కొడంగల్ బరిలో గెలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రేవంత్ మళ్ళీ పార్లమెంట్ వైపు వెళ్ళే అవకాశాలు లేవు. అసెంబ్లీ వైపే ఉంటారు...పైగా కాంగ్రెస్‌లో రేవంత్ కూడా ఒక సీఎం అభ్యర్ధి..ఈ క్రమంలో కొడంగల్‌లో రేవంత్ గెలవడం చాలా ముఖ్యం. ఇప్పటికే కొడంగల్‌లో రేవంత్‌కు అనుకూల వాతావరణం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ సత్తా చాటుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: