రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే కొన్ని జిల్లాల్లో వైసీపీ హవా ఎప్పుడు ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా....కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో రాజకీయం ఎప్పుడూ వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. అందుకే గత ఎన్నికల్లో ఈ మూడు జిల్లాలని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఈ జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ మీద బాగా వ్యతిరేకత...జగన్ గాలి ఎక్కువగా ఉండటం వల్ల వైసీపీ సత్తా చాటేసింది.

విజయనగరంలో 9 సీట్లు ఉంటే 9 వైసీపీ గెలిచేసింది...ఇటు నెల్లూరులో 10, కడపలో 10, కర్నూలు 14 సీట్లని వైసీపీ గెలుచుకుంది. మరి గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ఫ్యాన్ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేస్తుందా? అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి. ఈ రెండున్నర ఏళ్లలోనే రాజకీయం బాగా మారింది. గత ఎన్నికల నాటి పరిస్తితి మాత్రం ఇప్పుడు లేదు....వైసీపీ బలం కాస్త తగ్గగా, టీడీపీ బలం కాస్త పెరిగింది.

ఈ పరిస్తితిని బట్టి చూస్తే వైసీపీకి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అసలు విజయనగరం, కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ జరగడం కష్టమనే చెప్పాలి. ఈ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూడా పుంజుకుంది. వైసీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చు గానీ, క్లీన్‌స్వీప్ మాత్రం చేయలేదని చెప్పొచ్చు.

ఇటు కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా క్లీన్‌స్వీప్ చేసే విషయంలో డౌట్ ఉందనే చెప్పాలి. ఈ రెండు జిల్లాల్లో కూడా రెండు, మూడు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయింది. కడపలో రెండు సీట్లలో టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. ఇటు నెల్లూరులో కూడా రెండు, మూడు సీట్లలో టీడీపీకి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సారి ఫ్యాన్‌కు  సైకిల్ క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ ఇచ్చేలా లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: