రాజ‌కీయం వేరు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయం వేరు. ఆ మాట‌కు వ‌స్తే ఉత్త‌రాంధ్ర రాజ‌కీయంలో చాలా మ‌లుపులు ఉన్నాయి. క్యాస్ట్ పాలిటిక్స్ కు పేరు ఈ ప్రాంత‌మే! అయినా కూడా కొంద‌రు తాము న‌మ్ముకున్న పార్టీని వీడి రాలేదు. తొలి రోజులలో అంటే వైసీపీని ప్రారంభించిన కొత్త‌ల్లో కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయ‌కులు రానే రాలేదు. అప్ప‌టికీ ఉమ్మ‌డి ఆంధ్రాలోనే అంతా ఉన్నారు. ఎందుక‌నో జ‌గ‌న్ పై అంత‌గా విశ్వాసం ఎవ్వ‌రూ ఉంచ‌లేదు కూడా! రాజ‌కీయంలో ప‌రిప‌క్వ‌త లేని కార‌ణంగా ఆయ‌న‌కు తాము మ‌ద్ద‌తిచ్చేదే లేద‌ని కూడా చాలా మంది బాహాటంగానే పీసీసీ వేదిక‌ల‌పై మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. 




అదే సంద‌ర్భంలో ఆయ‌న అక్ర‌మాస్తుల‌పైనా చేయ‌రానివి, అన‌రానివి కొన్ని మాట‌లు అని సోనియా ద‌గ్గ‌ర మార్కుల కోసం తాప‌త్ర‌య ప‌డ్డారు. కానీ త‌రువాత రూట్ మార్చి విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ లో ఉంటే త‌మ‌కు భ‌విత‌వ్యం ఉండ‌ద‌ని కొంద‌రు నేత‌లు ఇటుగా వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ వారికి తొలుత ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ఎందుక‌నో వారిపై పెద్ద‌గా న‌మ్మ‌కం కూడా ఉంచ‌లేదు. త‌రువాత త‌రువాత వారికి ఉత్త‌రాంధ్ర ప‌రిణామాల‌పై ఉన్న అవగాహ‌న రీత్యా పార్టీలో క్రియాశీల‌క స్థానాల‌లో చోటిచ్చారు. బొత్స స‌త్య నారాయ‌ణకు కానీ ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు కానీ తొలి రోజుల్లో ఇంతటి హ‌వా లేనే లేదు. త‌రువాత కాలంలో వీరిని యాక్టివ్ మెంబ‌ర్స్ ను చేశారు.


రాష్ట్ర రాజ‌కీయాల్లో వైఎస్ ద‌గ్గర అత్యంత స‌న్నిహితంగా మెలిగిన వారిలో ఆ ఇద్ద‌రూ ముఖ్యులు. బొత్స‌కు, ధ‌ర్మాన‌కు మంచి ప్రాధాన్యం ఇచ్చేవారు వైఎస్. పలు నిర్ణ‌యాలు కూడా వారి మాట అనుసారం తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసేవారు. త‌న మాట నెగ్గ‌ని చోటు తానెందుకు అనే ధోర‌ణి ధ‌ర్మాన‌కు ఇవాళ ఉన్నా ఆ రోజు మాత్రం అలా లేదు. రెవెన్యూ మంత్రి హోదాలో ఉమ్మ‌డి ఆంధ్రాలో చ‌క్రం తిప్పారు. బొత్స కూడా అంతే స్థాయిలో త‌న హ‌వా న‌డిపారు. స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో పెను వివాదాల‌కు చోటిచ్చారు బొత్స. ఆ విధంగా చెడ్డ అయిపోయారు. అదేవిధంగా క‌న్నెధార కొండ లీజు విష‌య‌మై త‌న కుమారుడికి ఆ క్వారీనీ ద‌క్కించే విష‌య‌మై ధ‌ర్మాన నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వైనంతో చెడ్డ అయిపోయారు. అటుపై మారిన ప‌రిణామాల్లో ఇద్ద‌రూ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు చేరిన ఒక‌రు (బొత్స ) మాత్ర‌మే మంత్రి కాగ‌లిగారు. ధ‌ర్మాన మాత్రం అలానే ఉండిపోయారు. అవ‌శేషాంధ్ర‌కు రెండు సార్లు జ‌రిగిన ఎన్నికల్లో మొద‌టిసారి ఓడిపోయారు ధ‌ర్మాన‌. రెండో సారి స్వ‌ల్ప మెజార్టీతో గెలిచారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఉత్త‌రాంధ్ర‌లో ఈ ఇద్దరు వ‌ల‌స ప‌క్షులూ రాజ‌కీయాల్లో కీల‌కం. సొంత పార్టీ పెట్టే స‌త్తా ఉన్న బొత్స‌ను, సొంత సామాజిక‌వ‌ర్గంతో ఎంతైనా రాజ‌కీయం న‌డ‌ప‌డ‌గలిగే స‌త్తా ఉన్న ధ‌ర్మాన‌ను ఇవాళ జ‌గ‌న్ ఎంత మేర‌కు వినియోగించుకుంటున్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే!

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp