రాజ‌కీయంలో ఓ చోటు ఉండ‌డం. ఒకే చోట నుంచి రాజ‌కీయం చేసి ఎదిగి త‌రువాత అక్క‌డే చివ‌రిదాకా ఆఖరి శ్వాస దాకా ఉండాల‌నుకోవడం అన్న‌వి కుద‌రని ప‌నులు. కేసీఆర్ అయినా మ‌రొక‌రు అయినా పార్టీ వీడి స‌క్సెస్ అయిన‌వారే! చంద్ర‌బాబు కాంగ్రెస్ ను వీడి స‌క్సెస్ కొట్టారు. కేసీఆర్ టీడీపీని వీడి స‌క్సెస్ అయ్యారు. జ‌గ‌న్ కూడా అంతే! కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టారు. అయితే సొంత పార్టీ లేదా పేరున్న పార్టీలో చేరి రాజ‌కీయం చేయ‌డం అన్న‌వి వెరీ కామ‌న్. రేవంత్ కూడా ఇంతే! ఆ మాట‌కు వ‌స్తే నేత‌లంతా ఎక్క‌డి నుంచో ఎదిగి వ‌చ్చి త‌రువాత ప్రాభ‌వం నిలుపుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలే ఇవి! 



ఈ క్ర‌మంలో స‌క్సెస్ రేటు కూడా బాగుంది. అందుకే  తొలి నుంచి తమ‌ను న‌మ్ముకున్న వారిని తెలివిగా అక్క‌డే ఉంచి పార్టీ మారిన వారూ ఉన్నారు. ఆ కోవ‌లో ఆ తోవ‌లో చాలా మంది స‌క్సెస్ అయ్యారు కూడా! లీడ‌ర్ ఓ చోట ఉండి క్యాడ‌ర్ ను ప్ర‌త్య‌ర్థి పార్టీలో ఉంచి నాట‌కం న‌డిపిన వారు అటు తెలంగాణ‌లో ఇటు ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఇక తెలంగాణ‌లో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన వారంతా చాలా స‌క్సెస్ అయ్యారు. ఇప్ప‌టికిప్పుడు విజ‌యం సాధించిన వారిలో మొద‌టి వ‌రుస‌లో నిలిచే వారు ఈటెల మ‌రియు ర‌ఘునంద‌న్.


వాస్త‌వానికి టీడీపీ నుంచి వ‌చ్చిన తుమ్మల నాగేశ్వ‌ర‌రావు, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ లాంటి ఫ‌క్తు ప‌సుపు జెండా లీడ‌ర్లు కూడా ఇక్క‌డ స‌క్సెస్ అయ్యారు. ఇటీవ‌లే చేరిన ఎల్ ర‌మ‌ణది కూడా ఇదే కోవ ఇదే తోవ. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఆఫ‌ర్ చేసి ఇటు తీసుకున్నారు. హుజురాబాద్ ఎన్నిక అన్న‌దే లేక‌పోతే కౌశిక్ రెడ్డి హాయిగా కాంగ్రెస్‌లోనే ఉండేవాడు. ఇంత‌కుమించిన నేత‌గా ఎదిగేవాడు. ఏద‌యితేనేం కేసీఆర్ ని తిట్టిన వారు, కేసీఆర్ నుంచి విడిపోయి బీజేపీకి వెళ్లిన వారు ఇటీవ‌ల బాగా స‌క్సెస్ అయ్యారు. ఎందుకంటే అది వాళ్ల స్వ‌యంశ‌క్తి క‌నుక! అందుకు బీజేపీ కూడా కొంత అద‌న‌పు బ‌లం అందించి ఉంది క‌నుక ! ఈ పాటి సాయం సంద్రంను పోలిన కాంగ్రెస్  చేయ‌దా అంటే చేయ‌దు గాక చేయ‌దు.


అందుకే వీళ్లంతా స‌క్సెస్.. రేప‌టి వేళ రేవంత్  ఏ పాటి స‌క్సెస్ అవుతారో కూడా చూద్దాం.. ఎందుకంటే గ్రూపు రాజ‌కీయాలు ఎక్క‌డ‌యినా ఉన్నా కూడా కాంగ్రెస్ లాంటి పెద్ద స‌ముద్రంలో అవి సునామీల‌ను సృష్టిస్తూనే ఉంటాయి. ఆ విధంగా కొన్ని సంద‌ర్భాల్లో వ‌ల‌స రాజ‌కీయం ఫ‌లించింది..కొన్ని సార్లు ఫ‌లితం ఇవ్వ‌లేదు. విజ‌య‌శాంతికి, అలే న‌రేంద్ర‌కు, దేవేంద‌ర్ గౌడ్ కు అదే విధంగా ఇంకొంద‌రికి వ‌ల‌స రాజ‌కీయం క‌లిసి రాలేద‌న్న‌ది ఓ వాస్త‌వం. చేదు నిజం కూడా ఇదే!

మరింత సమాచారం తెలుసుకోండి: