శబ్దం గెలిచింది శాస‌నం గెలిచేలా చేసింది

శాస‌నం నియంతృత్వం నుంచే వ‌చ్చి ఉంది

కానీ శ‌బ్దం ప్రేమ పూర్వ‌క ప్ర‌తిపాదన నుంచి వ‌చ్చింది

అవును! శ‌బ్దం గెలిచింది శాస‌నం ఓడిపోయింది

క‌లెక్ష‌న్ల సునామీలో శాస‌నం కొట్టుకు పోవ‌డం ఖాయం





అఖండమ‌యిన విజ‌యంలో ఉన్నారు బాలయ్య. విజ‌యంలో ఉన్నా విజయోత్సాహంలో ఉన్నారు. ఊహించ‌ని విజ‌యంలో ఆనం దం చిందిస్తూ ఉన్నారు. ఓ విధంగా విజ‌య ల‌క్ష్మి వ‌రించిన వేళ ద‌క్కిన గొప్ప వ‌రం ఆయ‌న‌కు. చాలా రోజుల నుంచి మంచి విజయం కోసం, మంచి ఉత్సాహం నింపే విజ‌యం కోసం, ప‌రిత‌పిస్తున్న బాల‌య్య‌కు ఆయ‌న మార్కు సినిమా దొర‌క‌డం ఆయ‌న మాత్ర‌మే చేయ‌గ‌ల పాత్ర రూపొంద‌డం ఇవ‌న్నీ ఇవాళ  చిత్ర విజ‌యానికి కార‌కాలు. డ‌బ్బులు వ‌స్తాయో రావో అని అంతా అనుకుం టు న్న స‌మ‌యాన జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కాస్త వివాదాలు దారి తీసిన సంద‌ర్భాన ఈ సినిమా మ‌రో ప్ర‌భంజ‌నం అయింది. 




థియేట‌ర్ల‌న్నీ మాస్ జాత‌ర‌ను త‌ల‌పిస్తున్నాయి. బాల‌య్య అభిమానులే కాదు ఇత‌ర సినిమాల అభిమానులు కూడా ఆనందిస్తు న్నారు ఇవాళ సినిమా రిజ‌ల్ట్ చూసి..! ముఖ్యంగా ప్ర‌వాసాంధ్రులు సైతం సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అఖండ పాత్ర‌లో బాల య్య న‌టించిన తీరు ఎంతో బాగుంద‌ని అబ్బుర‌ప‌డుతున్నారు. సంబర ప‌డుతున్నారు. ఇదే సంద‌ర్భాన ఎవ‌రిది శ‌బ్దం.. ఎవ‌రిది శాస‌నం అన్న‌ది తేలిపోవాలి.




జ‌గ‌న్ శాస‌నం చేశారు కానీ బాల‌య్య త‌న శ‌బ్దంతో వ‌సూళ్ల సునామీ సృష్టించారు. జ‌గ‌న్ శాస‌నం చేశారు కానీ బాల‌య్య అవేవీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుని పోయారు. జ‌గ‌న్ శాస‌నం చేయాల‌నుకున్నా కూడా థియేట‌ర్ కు వ‌చ్చే అభిమాని ఎక్క‌డా త‌గ్గ‌లేదు. జ‌వాద్ తుఫాన్ లో కూడా థియేట‌ర్ల‌కు పోటెత్తారు. ఈ సినిమా ప్ర‌భావం మిగతా సినిమాల‌పై కూడా త‌ప్ప‌క ఉంటుంద‌ని మొద‌ట్నుంచి అంటున్నారు. అదేవిధంగా ఉండ‌బోతోంది కూడా! రాబోయే సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప ఉంది. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అఖండ అందించిన విజ‌యానికి కొన‌సాగింపుగానే త‌మ అభిమాన హీరో సినిమా ఉంటుంద‌ని బ‌న్నీ ఫ్యాన్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఓ విధంగా శాస‌నం బాల‌య్య‌ది. జ‌గ‌న్ ది కాదు.. జ‌గ‌న్ ది కేవ‌లం శ‌బ్ద డాంబికం మాత్ర‌మే!


మరింత సమాచారం తెలుసుకోండి: