భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు కరోనా కంటే అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశముందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గిల్ బర్ట్ అన్నారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారుల పట్ల ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఇప్పటికే కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 50లక్షలకు పైగా బాధితులు మృతి చెందినట్టు చెప్పారు. కాగా గిల్ బర్ట్ కోవీషీల్డ్ టీకా తయారీలో భాగస్వామిగా ఉన్నారు.

కోరనా థర్డ్ వేవ్ వల్ల పరిస్థితులు దారుణంగా మారనున్నాయని ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ సృష్టికర్తల్లో ఒకరైనా సారా గిల్బర్ట్ వెల్లడించారు. వైరస్ మన జీవితాలను, ఉపాధికి ముప్పు కలిగిలించడం ఇది చివరి సారి కాదన్నారు. ఈ సారి రాబోయే వైరస్ మరింత అధ్వాన్నంగా ఉండొచ్చన్నారు. మునుపటి వేరియంట్ల కంటే ఇది భయంకరమైందన్నారు. మరింత ప్రాణాంతకం కావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని చెప్పారు. రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 195 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరొకరు మృతి చెందారు. గడిచిన 24గంటల్లో 37వేల 108కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 77వేల 138కి చేరింది. మృతుల సంఖ్య 4వేలుగా నమోదైంది. ఇక కరోనా బారి నుంచి నిన్న 171మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 810యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో అయితే గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18వేల 788పరీక్షలు నిర్వహించగా.. 122కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14వేల 453కి చేరింది. మరోవైపు ఒకే రోజు 213మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20లక్షల 57వేల 369కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2వేల 30యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.  











మరింత సమాచారం తెలుసుకోండి: