పీఆర్సీ విష‌యంలో త‌మ డిమాండ్లు నెర‌వేర్చాల‌ని కోరుతూ ఇవాళ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగ సంఘాలు స‌మ్మె చేప‌ట్ట‌నున్నాయి. ఉద్యోగ సంఘాలు చేప‌ట్టబోయే ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఏపీ ట్రెజ‌రీ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ నిర్ణ‌యించుకున్న‌ది. ఈ మేర‌కు తాము స‌మ్మెలో పాల్గొన‌డం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్రెజ‌రీ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ర‌వికుమార్ ప్ర‌క‌టించారు. రేప‌టి నుంచి ఉమ్మ‌డి జేఏసీ త‌ల‌పెట్టిన నిర‌సన కార్య‌క్ర‌మాల‌లో ఏపీ ట్రెజ‌రీ ఉద్యోగుల సంఘం పాల్గొన‌డం లేదు అని స్ప‌ష్టం చేసారు.

ప‌ది రోజుల‌లో పీఆర్సీ ప్ర‌క‌టిస్తాం అని ఇటీవ‌ల తిరుప‌తిలో సీఎం జ‌గ‌న్ హామి ఇచ్చిన త‌రుణంలో నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్న‌ట్టు ర‌వికుమార్ వెల్ల‌డించారు. పీఆర్సీ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగ సంఘాల నేత‌లు అతిగా మాట్లాడుతున్నారు అనే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వాన్ని తెచ్చేది మేమే.. కూల్చేది మేమే అన్న‌ట్టుగా ఏపీఎన్‌జీఓ నేత బండి శ్రీ‌నివాస‌రావు చేసిన వ్యాఖ్య‌లు కాస్త విమ‌ర్శ‌ల‌కు తావు ఇస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సార్ అని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను బ‌తిమిలాడిన ఆయ‌న ఒక్క‌సారిగా ఇలా మాట్లాడ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.

మ‌రోవైపు ఏపీలో 13ల‌క్ష‌ల ఉద్యోగులు ఉన్నార‌ని, ఒక్కో ఉద్యోగికి ఐదు ఓట్లు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వాన్ని బెదిరించ‌డం స‌రికాదు అని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇవాళ ఉద్యోగులు న‌ల్ల‌బ్యాడ్జీలు నిర‌స‌న తెలిపి.. న‌ల్ల‌బ్యాడ్జీల‌తో ఉద్యోగానికి హాజ‌రు కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు డిసెంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు ప‌లుమార్లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో పాటు ప్రాంతీయ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తామ‌ని ఏపీజేఏసీ చైర్మ‌న్ బొప్ప‌రాజు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 7 నుంచి న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న‌, డిసెంబ‌ర్ 10న మ‌ధ్యాహ్న భోజ‌నం విరామంలో నిర‌స‌న‌లు.. 13న డివిజ‌న్‌, తాలుకా స్థాయిలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టున్న‌ట్టు బొప్ప‌రాజు చెప్పిన విష‌యం విధిత‌మే. అదేవిధంగా ఈనెల 27 నుంచి విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి, ఏలూరుతో స‌హా నాలుగు చోట్ల ఉద్యోగుల‌తో ప్రాతీయ స‌ద‌స్సులు కూడా నిర్వ‌హిస్తాం అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: