భార‌త్ ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగవ‌ శక్తిమంతమైన దేశంగా ఎదిగినా ఇప్పటికీ వరకట్నం, కూతురు కంటే కోడలు తక్కువ అని.. సామాజిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోడళ్లను కేవలం పని మనుషులుగా, పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే చూసే అత్తగారి ఇళ్లు, ఆడపిల్లల‌ను కన్నందుకు శాపాలు, మగ పిల్లాడిని కనివ్వాలని ఒత్తిడిలు, బలవన్మరణాలు వంటి కేసులు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటుంటాం. అయితే వాస్త‌వానికి కుటుంబంలో కూతుర్ల‌ కంటే కూడా కోడలుకి ఎక్కువ హక్కు ఉంటుందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువ‌రించింది.

కుటుంబానికి సంబంధించి వారసత్వంగా దక్కే అన్ని విషయాలకూ కోడలు చట్టబద్ధ వారసురాలేన‌ని  అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసిన‌ది. ఈ మేరకు కోడలు లేదా విధవరాలైన కోడళ్లను కుటుంబ వారసుల జాబితాలో చేర్చుతూ చట్టాన్ని సవరించాలని కూడా కోర్టు  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంలో 2019 ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వుల‌ను సవరణ చేయాలని స్ప‌ష్టం చేసింది.

కోడలుకు హక్కుల విషయంలో వేరువేరు రాష్ట్రాల‌లో వేర్వేరు చట్టాలు ఉండడాన్ని కోర్టు గుర్తించిన‌ది. ఉత్తర్‌ప్రదేశ్ నిత్యవసర వస్తువుల చట్టం 2016లో ఇంటికి వచ్చే కోడలును కుటుంబ సభ్యురాలుగా పేర్కొనలేదు.  2019లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కోడలు కుటుంబంలో సభ్యురాలు కాదనే ఆదేశాలు ఇచ్చింది.  దీంతో ఇంటికి వచ్చే కోడలు తన హక్కులను కోల్పోతుందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన త‌రువాత  నిజానికి కన్న కూతురు కంటే కోడలు లేదా విధవరాలైన కోడలుకే కుటుంబంలో ఎక్కువ హక్కులు ఉంటాయని అల్‌హాబాద్ హైకోర్టు  స్ప‌ష్టం చేసిన‌ది.  ఇంటికి వచ్చిన కోడలు విధవరాలైనా కాకపోయినా, కూతురు విడాకులు తీసుకున్నా లేదా విధ‌వ‌రాలు అయిన వారి కంటే ఎక్కువ హ‌క్కులు ఉంటాయ‌ని హై కోర్టు వెల్ల‌డించింది.
 
అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పుష్పాదేవి అనే మ‌హిళ భ‌ర్త మ‌ర‌ణించ‌గా అత్త మ‌హాదేవితో క‌లిసి ఉంటుంది. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఇదివ‌ర‌కు మ‌హాదేవి పేరు మీద ఓ రేష‌న్ షాపు ఉండేది. ఇటీవ‌ల మ‌హాదేవి మ‌ర‌ణించ‌డంతో.. రేష‌న్ షాపును త‌న‌కు కేటాయించాల‌ని కోడ‌లు పుష్పాదేవి ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. అయితే అయితే పుష్పాదేవి మ‌హాదేవి వార‌సురాలు కాదు అని 2019 ఆగ‌స్టు 5న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంటూ ఆమెకు రేష‌న్ షాపు కేటాయించ‌కుండా నిరాక‌రించింది. ఏ ఆధారం లేని త‌న‌కు అత్త వార‌సత్వం వ‌చ్చే రేష‌న్ షాపు ఒక్క‌టే దిక్కు అని.. దానిని త‌న‌కే ఇప్పించాలి అని కోరుతూ బాధితురాలు పుష్పాదేవి హైకోర్టును ఆశ్ర‌యించిన‌ది. విచార‌ణ జ‌రిపిన అల‌హాబాద్ హై కోర్టు కుంటుంబంలో కూతురు కంటే కంటే కోడ‌లుకే ఎక్క‌వ హ‌క్కులు ఉంటాయి అని.. ఆమెకు రేష‌న్ షాపు కేటాయించాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్  ప్ర‌భుత్వం కూడా ఆచ‌ట్టంలో మార్పులు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది హై కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: