కొన్ని దశాబ్దాల కాలం పాటు దేశాన్ని పాలించిన పార్టీలో కాంగ్రెస్ పార్టీ చాలా చరిత్ర కలిగిన పార్టీ. భారతదేశ ప్రజలను ఎక్కువ కాలం పాలించిన పార్టీ. వాస్తవానికి చెప్పాలంటే  దేశంలో రాజకీయం  నేర్పింది ఈ పార్టీ అని చెప్పవచ్చు. అలాంటి స్థాయి నుంచి  క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చతికిల పడుతూ చివరికి అధికారాన్ని కోల్పోయింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక వివాదంతో పార్టీ ఎప్పుడు కనబడుతోంది. దీంతో  ఇది గమనించి నటువంటి అధిష్టానం పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలనుకుంది. ఆ దిశగానే అడుగులు వేసి వ్యూహాలు రచిస్తున్నా సమయంలో మళ్లీ కాంగ్రెస్ కు పీకే వైరస్ చుట్టుకుంది. కాంగ్రెస్తో మంచి సంబంధం కలిగి ఉండి, ఆ పార్టీలోనే చేరతాడు అనుకున్న పీకే పూర్తి భిన్నంగా మారిపోయాడు.

కాంగ్రెస్ పై అస్త్రాలు విసురుతూ  దెబ్బ తీస్తున్నాడు. మరి దీనికి అసలు కారణమేమిటి.. తెలుసుకుందాం..! జాతీయస్థాయిలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. బిజెపి కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఎవరికి వారే వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో పీకే  దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలు ఏకమై ఎన్నికలకు వెళితేనే బిజెపిని ఎదుర్కోగలరని లేకుంటే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రశాంత్ కిషోర్ బహిరంగానే చెప్పారు. దీనికి తోడు ఆయన ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ దగ్గరికి చేర్చేందుకు ప్రయత్నాలు కూడా చేశాడు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. కానీ ఆయన మనసు మార్చుకున్నాడు. మాట కూడా మార్చేశాడు. ప్రాంతీయ పార్టీలకు నేతృత్వం వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి హక్కు లేదని, ఆ పార్టీ వరుసగా ఓడిపోతుందని చెబుతూ వస్తున్నాడు. ఆయన ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ గా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఆయన నమ్మిన మమతాబెనర్జీ అటు కాంగ్రెస్ పార్టీని కూడా మైనస్ చేసేందుకు  ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా ప్రశాంత్ కిషోర్ గేమ్ అని ఇది ఆమె గుర్తించడం లేదని, రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పొలిటికల్ స్టార్టజీ   ప్రకారం చెప్పుకోవాలంటే  ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తారని అదే కాంగ్రెస్ ను చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: