ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీ శ్రేణులు కాస్త గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఈ క్రమంలోనే అవసరమైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో కూడా టిడిపి పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం తో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీచేశాయి. ఇది కొన్ని చోట్ల మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఉదాహరణకు పశ్చిమ గోదావరి , తూర్పు గోదావరి జిల్లా జిల్లాలో ఈ రెండు పార్టీల పొత్తు మంచి ఫలితాలను ఇచ్చింది.

జనసేన - టిడిపి పొత్తు ఉన్నచోట్ల రెండు పార్టీలు లాభం పొందాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాతో వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీని చిత్తు చిత్తు చేయవచ్చు అన్న‌దే టిడిపి - జనసేన నాయకులు అభిప్రాయంగా కనిపిస్తోంది. జనసేన - టిడిపి పొత్తు పెట్టుకుంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఎదురుదెబ్బలు తప్పవని అంటున్నారు.

2014 ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఉభ‌య గోదావ‌రి జిల్లా ల‌తో పాటు కృష్ణా - గుంటూరు జిల్లాల్లో వైసిపి చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మళ్లీ జనసేన టిడిపి కలిస్తే వైసీపీకి ఈ నాలుగు జిల్లాల్లో 2014 ఎన్నికల నాటి ఫలితాలే వస్తాయని అంటున్నారు.

దీనికి తోడు రాజధాని కృష్ణా - గుంటూరు జిల్లాల్లో వైసీపీకి మరింత పెద్ద దెబ్బ తగులుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉత్త‌రాంధ్ర లోనూ ఈ కాంబినేష‌న్ బ‌లంగా ప‌ని చేస్తే అక్క‌డ కూడా అధికార పార్టీ కి షాకులు అయితే త‌ప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: