జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ప్రముఖ సినీ నటుడు నాగబాబు గత ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున తన సొంత జిల్లాలోని నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో నాగబాబు మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన భార్య ను పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో నాగబాబు ఫ్యామిలీ నుంచి ఎవరు ప్రజారాజ్యం తరఫున పోటీ చేయలేదు.

గత ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ... నాగబాబు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. నాగబాబు ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ... ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి రావ‌డం మరో షాక్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి - జనసేన మధ్య పొత్తు కుదురుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ పొత్తు కుదిరితే నాగబాబు 2024 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు.

గత ఎన్నికల్లో నాగబాబు పోటీ చేసిన నరసాపురం సీటు ఈసారి టిడిపి తీసుకుంటుందని ... అందుకు బదులుగా జనసేన తో పొత్తు ఉంటే నాగబాబు కాకినాడ బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ... కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈసారి నాగబాబు బ‌రి కాకినాడ అని తెలుస్తోంది.

అలాగే కాకినాడ పార్ల‌మెంటు ప‌రిధి లో టీడీపీకి కూడా బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు పార్టీలు క‌లిస్తే అక్క‌డ నాగ‌బాబు ఈ సారి అయినా లోక్‌స‌భ లోకి వెళ‌తాడేమో ?  చూడాలి .

 

మరింత సమాచారం తెలుసుకోండి: