ఒకప్పుడు వాహన దారులు రోడ్డు నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ  ఎలాంటి జరిమానాలు పడకుండానే తప్పించుకునే వారు. కానీ ప్రస్తుత సమయం  లో మాత్రం ఆ అవకాశమే లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వాహనం ఆపి  అప్పుడు చలాన్లు వేసేవారు. కానీ ఇప్పుడు వాహనం ఆపాల్సిన పనిలేదు. వాహన దారుడు రోడ్డు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు అని తెలిస్తే చాలు చేతిలో ఉన్న కెమెరా తో ఒక క్లిక్ ఇస్తారు. ఇక నేరుగా వాహన  దారుడు ఇంటికి చలాన్ పోస్టులో వెళ్తుంది.


 ఒకవేళ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు లేక పోతే ఇక అక్కడ అమర్చిన సీసీ కెమెరాల ద్వారా రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. ఈ క్రమం  లోనే నేటి రోజుల్లో వాహన దారులు జరిమానాల నుంచి తప్పించు కోవడం లేదు. దీంతో చాలా మంది వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం. అయితే కొంత మంది వాహన దారులు జరిమానాలు పడినప్పటికీ అవి చెల్లించకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉంటారు.



 దీంతో కొన్ని కొన్ని వాహనాల పై ఏకంగా జరిమానాలు తడిసి మోపెడవుతు ఉండటం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమం లోనే ట్రాఫిక్ పోలీస్ లను చూసిన యువకుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారి  పోయాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే బండి పై ఎన్ని చలాన్లు ఉన్నాయో చెక్ చేసి అవాక్కయ్యారు. ఆ వాహనం పై 179 చలాన్లు ఉండగా 42 వేల జరిమానా పడింది. దీంతో చేసేదేమీ లేక వాహనాన్ని సీజ్ చేసికాచిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: