దేశ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ రోజురోజుకు దిగ‌జారిపోతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ సీనియ‌ర్ నేత గులాంన‌బీ అజాద్ తాజా వ్యాఖ్య‌ల‌తో స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌ల‌యింది. కొన్ని రోజులగా పార్టీ రెబ‌ల్ నేత‌గా కొన‌సాగుతున్న అజాద్ కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్ర‌చారం తీవ్రంగా సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో జ‌మ్మూ క‌శ్మీర్‌లో అజాద్ విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌డం ఆయ‌న స‌న్నిహితులు అయిన 20 మంది నేత‌లు కాంగ్రెస్ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన నేప‌థ్యంలో సొంత పార్టీ చేయ‌నున్న‌ట్టు ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి.


 అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన అజాద్‌.. సోనియా, రాహుల్ నాయ‌క‌త్వంపై తీవ్ర విమ‌ర్వ‌లు గుప్పించారు. అలాగే, కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కొత్త పార్టీ పెట్ట‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో చాలా కాలంగా నిలిచిపోయిన రాజ‌కీయ కార్యక్ర‌మాలు పున‌రుద్ధరించ‌డానికి స‌భ‌లు, స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నాన‌ని వెల్ల‌డించారు. అయితే, పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న‌పై.. మ‌నం ఎప్పుడు చ‌నిపోతామ‌న్న‌ది మ‌న‌ది మ‌నకు తెలియ‌న‌ట్టుగానే రాజ‌కీయాల్లో కూడా త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌ని, ఆ విష‌యం గురించి ఎవ్వ‌రు చెప్ప‌లేర‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.


 తాను రాజ‌కీయాల‌ను వ‌దిలేద్దామ‌నుకున్నాన‌ని, కానీ.. ల‌క్షలాధిమంది త‌న మ‌ద్ధ‌తుదారుల కోసం రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నాన‌ని జ‌మ్ముక‌శ్మీర్ మాజీ సీఎం అజాద్ వెల్ల‌డించారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో ఆయ‌న పై పార్టీ పెద్ద‌లు గుర్రుగా ఉన్నార‌ట‌. అజాద్ త‌న రాజ‌కీయంలో అనూహ్య వ్యాఖ్య‌లు చేశారు. గ‌డిచిన కొద్ది నెల‌లుగా పార్టీ నేత‌ల్లో రెబ‌ల్ నేత‌గా కొన‌సాగుతున్న ఆయ‌న కాంగ్రెస్‌ను వీడుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. పార్టీ అధిష్టానం ప్రోత్సాహంతో అన్ని ప‌ద‌వులు అనుభ‌వించిన అజాద్‌.. ఇప్పుడు అదే అధిష్టానంపై ధిక్కార స్వ‌రం వినిపించ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.


 
   

మరింత సమాచారం తెలుసుకోండి: