కరోనా వైరస్ సమయంలో ప్రతి ఒక్కరు ఎంతలా అల్లాడిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ పై పోరాటానికి వ్యాక్సిన్ అనేది ఎంతో కీలకం గా మారిపోయింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలోకి వచ్చిన కొత్తలో వ్యాక్సిన్ వేసుకోవడం విషయంలో ఎంతో నంది అనుమానాలు అపోహలు తోనే ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేసింది . దీంతో అందరూ స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తున్నారు.



 అదే సమయంలో అటు ఆరోగ్య కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తూ ఉండటం గమనార్హం. ఇలా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అటు ఆరోగ్య కార్యకర్తల పాత్ర ఎంతో కీలకంగా మారిపోయింది. కానీ అదే సమయంలో కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని చెప్పాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ఒకే సారి ఒక వ్యక్తికి రెండు రోజులు ఇవ్వడం లేదంటే ఒకే రకం డోస్ కాకుండా రెండు రకాల డోసులు ఇవ్వడం లాంటివి కూడా చేస్తున్నారు.


 ఇప్పటికే ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి  ఇక ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది. 18 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే వ్యాఖ్యలు ఇవ్వాలని  ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇటీవలే రెండు నెలల ఆడశిశువు, నాలుగు నెలల మగ శిశువుకు ఓ నర్సు  పొరపాటున కరోనా వ్యాక్సిన్ వేసిన  ఘటన బ్రెజిల్లో వెలుగులోకి వచ్చింది. చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  హైపటైటిస్ బీ వంటి వ్యాధులను ఎదుర్కొనేందుకు గాను రోగనిరోధక శక్తిని అందించే  టీకా వేయాల్సి ఉండగా  నర్సు మాత్రం కరోనా టీకా వేసింది. ఇక ఈ విషయం తెలిసిన వైద్యాధికారులు నర్సును తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: