భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో ఏం మాట్లాడతారు ? సహజంగా అధికార పక్షం పై నిందలు వేస్తారు ?  అంతేనా... లేకపోతే స్వంత పక్షం పై ప్రశంసల జల్లు కురిపిస్తారు.  సహజంగా ప్రతి రాజకీయ నేత చేసే పని ఇదే. కానీ దానికి భిన్నంగా వీర్రాజు మాట్లాడారు? ఏం మాట్లాడి ఉంటారు. ఎవరి గురించి మాట్లాడి ఉంటారు ?

 వీర్రాజు మీడియా సమావేశంలో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. రానున్న శాసన సభ ఎన్నికల తరవాత నుంచి కానీ, అంతకు ముందే కానీ తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని  స్వయంగా ప్రకటించారు. కారణం ఏంటని విలేఖరులు వీర్రాజును ప్రశ్నించగా మాట దాట వేశారు. ఈ ప్రశ్నకే కాదు మరికొన్ని ప్రశ్నలకు కూడా ఆయన స్పష్టమై న సమాధానం ఇవ్వలేదు.
ఇటీవల అంటే గత నెలలో కేంద్ర హోం శాఖ మంత్రి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఆ తరువాతనే అప్పటిదాకా నిద్రావస్తలోనూ, తమ వ్యాపార లావాదేవీల్లోనూ బిజీ బిజీగా ఉన్న నేతలంతా ఒక్క సారిగా జనంలోకి వచ్చారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. అంతే వారు వారికి తమ వంతుగా లక్షలాది రూపాయలను విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు పురంధ రేశ్వరి, సుజనా చౌదరి తో పాటు పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్, టిజి వెంటేష్ తదితరులు హాజరయ్యారు.  ఆ తరువాత బిజేపి నేతలు ఎక్కడా బహిరంగ కార్యక్రమాలలోపాల్గోన్నట్టు దాఖలా లేదు.  భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాత్రమే ఒక రోజు అమరావతి రైతులు పాదయాత్రకు హాజరైనానిపించుకున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా బిజేపి నాయుకులకు దిశా నిర్దేశం చేసిన సమయంలోనే రాష్ట్రపార్టీ అధ్యక్షుడు మార్పు ప్రస్తావన వచ్చిందని, తదపరి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అమిత్ షా అదేశాలు ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులు పేర్కోంటున్నాయి. అయితే తనకు కొంత సమయం కావాలని  సుజనా చౌదరి కోరడంతో అప్పటి దాకా సోము వీర్రాజునే పార్టీ వ్యవహారాలు చూడాలని అమిత్ షా నిర్దేశించినట్లు ఆ పార్టీ కీలక నేతలు తమ అనుచరు వద్ద ఈ విషయాన్ని నెమ్మదిగాపేర్కోన్నారు. దీంతో ఈ విషయం గోప్యంగా ఉంది. అతి త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగ నున్న నేపథ్యంలో గవర్నర్ లను మారుస్తారని, ఆప్పుడు సోము వీర్రాజు గవర్నర్ గిరి ఇస్తామని కూడా అమిత్ షా  ఆ సమావేశంలో పేర్కోన్నట్లు పార్టీ వర్గాల కథనం. వీర్రాజు రాజకీయలకు దూరంగా ఉంటానని చెప్పడం వెనుక కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి ఉండవచ్చని ఆ పార్టీ శ్రేణులు పేర్కోంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: