కేంద్రంలో అధికారంలో ఉన్నభారతీయ జనతా పార్టీతో ఆయనకు దశాబ్దాల అనుబంధం.. ప్రస్తుతం ఆయన  ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కూడా. ఆయన హయాంలో  భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికలను ఎదుర్కోంది. ఒకటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కాగా, మరోకటి బద్వేల్ శాసన సభ ఉప ఎన్నిక. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో  బిజేపి అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయారు. అయితే బద్వేల్ ఉప ఎన్నికలో ఆ పార్టీ సత్తా చాటింది.  ఆ ఎన్నికలలో రెండో స్థానానికి ఎదిగింది.
 దాదాపు వారం పదిరోజుల తరువాత భారతీయ జనతా పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా తో మాట్లాడారు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో బిజేపి నే ప్రధాన ప్రతిపక్షమని పేర్కోన్నారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బిజేపికి అధికారం కట్టబెట్టాలని అభ్యర్థించారు. భారత్ లో పద్దేనిమిది రాష్ట్రాలు  తమ పార్టీ ఏలుబడిలోనే ఉన్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే రాష్ట్రంలో అదికారం కట్టబెడితే అభివృద్ధి ఎక్కువ జరిగే అవకాశం ఉందని సోము వీర్రాజ తెలిపారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుటి పక్షం పై వేలెత్తి చూపడం మానుకోవాలని బారతీయ జనతా పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, రఘురామ కృష్ణం రాజులు ఒకరితో ఒకరు వాదులోడుకోవడం అందరికీ తెలిసిందే. అయితే గత కొం కాలంగా రఘురామ కృష్ణం రాజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నరనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలలో వీరిద్దరూ వాదులాడుకున్న నేపథ్యంలో  రఘరామ కృష్ణం రాజు బిజేపి చేరిక పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. దీనిపై విలేఖరులు సోము వీర్రాజును ప్రశ్నించారు. అదంతా ఢిల్లీ వ్యవహారం. వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు మందు తమ సొంత పార్టీని చక్కబెట్టుకోవాలి. అది మానేసి మాపై బురద జల్లితే ఎలా ? అని ప్రశ్నించారు. రఘరామ కృష్ణం రాజు అవినీతి పరుడంటున్నారు...ఆయన బిజేపిలో చేరుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఆయన అవినీతి పరుడైతే ఎందుకు మీ పార్టీలో టిక్కట్ ఇచ్చారు. ఎందుకు గెలిపించుకున్నారు ?  ఈ విషయాలకు ముందు మీరు సమాధానం చెప్పండి. ఆ తరువాత మమ్మల్ని అనండి అని సోము వీర్రాజు పేర్కోన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు పదకుండు వేల కోట్లురూపాయలు ఇచ్చిందని పేర్కోంటూ , తాము ప్రణాళిక ప్రకారం నిధులు మంజూరుచేస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: