ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్ర‌మం త‌ప్ప‌కుండా వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేస్తుంద‌న్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్ని కూడా చాలా రహస్యంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే చాలా చిత్రవిచిత్రమైన జీవోలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వం నుంచి వచ్చే జీవోల్లో చాలా వాటి గురించి ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త జీవో కూడా వచ్చింది. ఈ జీవి కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇక నుంచి ఏపీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే 5 శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల‌ట.

స్థలం రూపంలో అయినా లేదా డబ్బు రూపంలో నా అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్టం అని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే ప్రైవేట్ వెంచర్ల లో 5 శాతం కమీషన్ జగనన్న కాలనీలకు ఇవ్వాలన్నది ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. అయితే ఈ ఐదు శాతం కమిషన్ అనేది వాళ్ళు వేసే ప్రైవేటు వెంచర్ ల లో అయినా ఇవ్వచ్చు ... లేదా బయట మరో చోట అయినా ఇవ్వవచ్చన్న  రూల్ పెట్టినట్టు తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ లో వెంచర్లు వేయాలంటే రోడ్లు ఇతర అవసరాలు, పార్కుల‌కు స్థలం వదులుతారు. అయితే ఇప్పుడు అదనంగా మరో ఐదు శాతం అద‌నంగా భూమి వ‌దిలేయాల్సి ఉంటుంది. ఈ భూమిలో జ‌గ‌న‌న్న కాల‌నీ ఇళ్లు ఇస్తారు. లేదా స్థ‌లం ప్రాథ‌మిక విలువ పై క‌నీసం 5 % డ‌బ్బు అయినా స‌రే ప్ర‌భుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.

అంటే ప్ర‌తి వెంచ‌ర్ లో 10 శాతం సామాజిక అవ‌స‌రా ల కోసం కేటాయిస్తోన్న దానికి అద‌నంగా మ‌రో 5 శాతం స్థ‌లం వ‌ద‌లాల్సి ఉంది. ఇక రోడ్లు, ఇత‌ర అవ‌స‌రాల కు ఇచ్చే భూమి కూడా వ‌దిలేస్తే.. అప్పుడు మొత్తం వెంచ‌ర్ లో 50 % భూమి లో కూడా ప్లాట్లు వేసే ఛాన్సులు ఉండ‌వ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: