స్వరాజ్యం, స్వాతంత్ర దేశం అని పేరుకే, ప్రజాస్వామ్యం అనేది మాట వరకే, ఇక్కడ ప్రజలే అత్యంత బలహీనులు. వాళ్ళను పాలించే వాళ్ళు మాత్రం సేవకులుగా కాకుండా రాజాధి రాజులు అన్నట్టే ఉంటారు. ప్రజాస్వామ్యం అనేది ఆ ఓటు వేసే సమయంలో తప్ప మరెప్పుడు అనిపించదు. గెలిచాక అందరు అదే తరహాలో ఉంటారు. ఐదేళ్లు అంతా వాళ్లదే. కేంద్రంలో ఉన్నవారు దేశాన్ని నమిలేస్తారు, రాష్ట్రంలో ఉన్న నేతలు రాష్ట్రాన్ని నాకేస్తారు. కాకపోతే పన్నులు కేంద్రానికి పంపించాలి కాబట్టి, ఆ పన్నులతో పాటుగా కేంద్రం వాటాను కూడా పంపిస్తారు అంతే. ఒక ప్రాజెక్టు వస్తే ముందు కేంద్రం వాటా, తరువాత అది ఏ రాష్ట్రంలో వచ్చిందో అక్కడ రాష్ట్రప్రభుత్వానికి ఒక వాటా. ఈ రెంటిని మేపిన దానిని రాబట్టుకోవడానికి ప్రజల భూముల పై పడతారు. దానికి నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.

తాము తినేయడం కాదు, తమ వాళ్ళు కూడా తినేదానికి మార్గాలు బలే వెతుకుతారు నేతలు. ఒక్కసారి రాజకీయాలలోకి వస్తే, సంపాదన ఎంతంటే తరతరాలకు తరగనంత అనే ఆలోచన వాళ్లలో వచ్చేసింది. దానికి దేశద్రోహం అని పేరుపెట్టినా పట్టించుకునే నాదులు లేరు. మహా అయితే జైలుకు వెళ్తారు, అదికూడా, ఎలాగూ, గాంధీ లాంటి వరకు కూడా జైలుకు వచ్చారు అని చెప్పుకుంటూ గర్వంగా వెళతారు. అదే స్పీడ్ తో బయటకు వస్తారు. న్యాయవ్యవస్థలో వారికోసమే అన్నట్టుగా అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి మరి. అవన్నీ కనిపెట్టేది ఒక నల్ల కోటు, వాదించేది నల్లకోటు, బయటకు వచ్చేది నేతలు. అలాంటి కేసులు ఇంకా కోర్టులలో నలిగిపోతూనే ఉన్నాయి. అందుకే ఆయా కోర్టులలో పెండింగ్ కేసుల భారం నానాటికి పెరిగిపోతూనే ఉంది.

ముందు చట్టం సరిగ్గా ఉంటె అనాలా, నేతలు సరిగ్గా ఉండాలి అనాలా, ప్రజలు సరైన వారిని ఎన్నుకునే జ్ఞానాన్ని పొందాలి అనాలా! ఎన్ని అన్నప్పటికీ పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశాలు, రోజులు పోయాయి. ప్రతి వారికీ ఒక వీక్ పాయింట్ ఉంటుంది. దానిని అడ్డుపెట్టుకొని వీళ్లంతా తమ తప్పులను దాచేసుకుంటున్నారు. అవన్నీ బయటపడేటప్పటికీ వాళ్ళ వంశంలో ముని మనవడు కూడా ముసిలివాడు అయిపోతాడు. అది న్యాయవ్యవస్థ పరిస్థితి. ఇక్కడ ప్రజలు వెన్నుముకగా ఉండాల్సిన ప్రజా స్వామ్యంలో నేతలు ఎప్పుడు ప్రధానంగా మారారో అప్పుడే వ్యవస్థ నాశనం అవడం ఆరంభం అయిపోయింది. మారాలి అని ప్రతి ఒక్కరికి ఉంది, అడుగు వేయడానికి మాత్రం ఇన్నేళ్ళుగా ఆలోచిస్తూనే ఉన్నారు. 52 శాతం ఉన్న యువత కూడా స్తబ్దుగా ఉన్నచోట అభివృద్ధి ఆశించడం అత్యాశ ఏమో!

మరింత సమాచారం తెలుసుకోండి: