జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన పథకాలను ప్రవేశపెట్టారు. పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ భారీగానే డబ్బులు పంచుతుంది జగన్ ప్రభుత్వం. అయితే ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాల విషయంలో అటు బీజేపీ మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలని జగన్ ప్రభుత్వం పూర్తిగా పేరుమార్చి తామే ప్రవేశపెడుతున్నామని అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. కేంద్ర పథకాలను జగనన్న పథకాలు అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అని అంటున్నారు.



 ఇక ఇప్పుడు బిజెపి కొత్త విధంగా విభాగం ప్రభుత్వంపై విమర్శలు చేయడం గమనార్హం.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను జగన్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేక పోతుందని తద్వారా ప్రజలకు మేలు జరగడం లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ పథకం మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం  ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన నిధులను వాడుకోవడం కూడా జగన్ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు అంటూ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


 దీనికి సంబంధించిన లెక్కలను కూడా వెల్లడించారు జీవీఎల్ నరసింహారావు. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి 372 కోట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో నుంచి కేవలం 121 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. 2020 -21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 792 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 297 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది.2021- 22 లో 3082 కోట్లు కేంద్రం విడుదల చేస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఉపయోగించుకోలేదు అంటూ జీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. ఇలా జగన్ ప్రభుత్వం ఎందుకు కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేక పోతుంది అంటూ ప్రశ్నిస్తూ జీవీఎల్ నరసింహారావు ఒక లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: