జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తన పార్టీ వ్యవహారాల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకపోవడం పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కు ఎక్కువగా బాధ్యతలు అప్పగించి ఆయన సైలెంట్ గా ఉండడం పట్ల కాస్త క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ వ్యవహారాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోకపోవడంతో చాలామంది నాయకులు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని ప్రచారం కూడా ఉంది. దీనితో క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి పార్టీ నాయకత్వం సముఖంగా లేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

రాజకీయంగా అధికార పార్టీని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉండగా జనసేన పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళుతూ కనీసం ప్రజా ఉద్యమాలను నిర్వహించి విషయంలో కూడా ఒక అభిప్రాయంతో లేకపోవడం అనేది ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పాలి. రాజకీయంగా పార్టీని అదేవిధంగా నాయకులను ముందుకు నడిపించాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉందని లేకపోతే మాత్రం చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ లేదా మరో పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా వ్యవహరించడం వంటి అంశాలు కాస్త జనసేన పార్టీ ని బాగా ఇబ్బంది పెట్టాయి. బద్వేల్ ఉప ఎన్నికల్లో కొన్ని కారణాలతో పోటీ నుంచి తప్పుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పార్టీ వ్యవహారాల మీద పెద్దగా దృష్టి పెట్టకుండా కేవలం హైదరాబాదులో ఉండే అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు ఇస్తూ సమయం గడుపుతున్నారు అని ఆరోపణలు జనసేన పార్టీ వర్గాల్లోనే వినపడుతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే పవన్ కళ్యాణ్ దృష్టి పెడతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: