తెలుగుదేశం పార్టీ లో ఉన్న కొంతమంది కీలక నాయకులు అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి వెళ్లకపోవడం ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కొంతమంది నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయక పోవడం కాస్త ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనకు వెళుతున్న సరే నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రజలతో కనీసం మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కొంత మంది స్థానిక నాయకత్వం ముందుకు తీసుకువచ్చే విధంగా కష్టపడక పోవడమనేది ఇబ్బందికరంగా చెప్పాలి.

రాజకీయంగా టీడీపీ లో ఉన్న కొంతమంది కీలక నాయకులు అధికార పార్టీ వైపు లేదో జనసేన పార్టీ వైపు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే లను సమర్ధవంతంగా ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కీలక ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడం స్థానిక నాయకత్వానికి ధైర్యం కల్పించకపోవడం అదేవిధంగా జనసేన పార్టీ సహా మరికొన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లి పార్టీ స్వరాన్ని వినిపించే విషయంలో వెనకడుగు వేయడం అనేది ఇబ్బందికరంగా మారింది.

రాజకీయంగా పార్టీకి జవసత్వాలు నింపే సమయం వచ్చినా సరే చాలామంది సైలెంట్ గా ఉండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజల్లోకి వెళుతుందా లేకపోతే సైలెంట్ గా ఉండే సమయం వృధా చేస్తున్నదా అనేది చూడాలి. చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్న సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఆయన వద్ద కూడా ఎటువంటి విషయం చెప్పడం లేదని దీనివల్ల చంద్రబాబు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది టీడీపీ అనుకూల మీడియా కూడా కొన్ని సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు .

మరింత సమాచారం తెలుసుకోండి: