తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఢిల్లీలోనే ఎక్కువగా ఉండటం పట్ల తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు రేవంత్ రెడ్డి హాజరవుతున్న సరే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారని పార్టీ నాయకత్వం గురించి ఆయన కొన్ని ఫిర్యాదులు ఇచ్చారని త్వరలోనే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చాలా సీరియస్ గా ఉందని ఆయన కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈటెల రాజేందర్ లకు మద్దతు ప్రకటించడంతో సోనియాగాంధీ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా సరే రేవంత్ రెడ్డి సహా చాలామంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల మీద పట్టు నిలుపుకో లేక పోవడం అనేది ఇబ్బందికరంగా మారిన అంశం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి మీద చాలా ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇబ్బందులే గానీ పెద్దగా కలిసొచ్చిన పరిణామాలు ఏమీ లేవు.

హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నమ్మకం ఉందని ప్రచారం ఒక వర్గం చేస్తున్నా సరే రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం సీరియస్ గా ఉందని ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలు ఉండవచ్చు అని వచ్చే ఎన్నికలకు ముందు అధ్యక్ష మార్పు కూడా జరగవచ్చు అని ప్రచారం మొదలైంది. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: