జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్ని విధాలుగా కష్టపడుతున్న సరే రాష్ట్రాల్లో ఉన్న పిసిసి అధ్యక్షులు అదేవిధంగా డిసిసి అధ్యక్షులు కొంతమంది సీనియర్ నాయకుల నుంచి ఏ విధంగా కూడా సపోర్ట్ లేకపోవడమనేది ఇబ్బందికరంగా మారింది. ఉత్సాహవంతమైన నాయకత్వాన్ని ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం సిద్ధంగా ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందికర వాతావరణం ఎదురుకావడంతో సైలెంట్ గా ఉండే పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విషయంలో రాహుల్ గాంధీ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోగా  ప్రియాంక గాంధీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి అన్ని విధాలుగా పార్టీ మీద పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రియాంక గాంధీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం బాగా ఒత్తిడి చేస్తోందని సోనియాగాంధీ క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేరు కాబట్టి ప్రియాంకగాంధీ అయితే కచ్చితంగా ప్రజల్లోకి అవకాశం ఉంటుందని కేవలం ఉత్తరాది మీద  మాత్రమే పరిమితం కాకుండా దక్షిణాది మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమర్థవంతమైన నాయకత్వాన్ని కేంద్ర స్థాయిలో ఉంటుందని కాబట్టి ప్రియాంక గాంధీ పర్యటనలో అదే విధంగా ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కీలకమని అందుకే ప్రియాంక గాంధీ మీద కేసి వేణుగోపాల్ సహా కొంతమంది సీనియర్ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని ఇటీవలి కాలంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు ఆమెతో వరుసగా చర్చలు జరిపి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు అని కూడా అంటున్నారు. మరి ప్రియాంక గాంధీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది తెలియకపోయినా పార్టీ విషయంలో మాత్రం ప్రియాంక గాంధీ పట్టు పెంచుకునే రాహుల్ గాంధీ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: