దేశ రాజకీయాల్లో తన పట్టు పెంచుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆయనకు కొన్ని రాష్ట్రాల నాయకుల నుంచి మద్దతు లేకపోవడం అనేది ఇబ్బందికరంగా మారింది. చాలా వరకు కూడా కొంతమంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల్లో దూకుడుగా లేకపోవడంతో తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ పట్టు పెంచుకోవాలి అంటే కచ్చితంగా రాష్ట్రాల మీద ఉన్న నాయకులను దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

అయితే రాజకీయంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ పర్యటనకు వరుసగా వెళుతున్న సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం నిర్వహించి... సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇదే సలహా ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి సీఎం కేసీఆర్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

ఈ నేపథ్యంలోనే త్వరలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అలాగే బీహార్ ప్రతిపక్ష నేతతో సమావేశం నిర్వహించ వచ్చు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం కొన్ని కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటుగా రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో హైలెట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది కాస్త ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పాలి. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: