రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..పరిస్తితులని బట్టి మారిపోతాయి...ఒక సమయంలో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న రాజకీయం...మరొక సమయంలో మరొక పార్టీకి అనుకూలంగా ఉంటుంది. 2014లో టీడీపీకి అనుకూలంగా ఉంటే...2019 ఎన్నికల్లో వైసీపీకి చాలా అనుకూలంగా మారింది. కానీ ఇప్పుడుప్పుడే మళ్ళీ పరిస్తితులు మారుతున్నాయి. ప్రజలు కాస్త వైసీపీకి దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఎక్కువగా కాకపోయినా...కొంతమేర మాత్రం ప్రజలు వైసీపీ నుంచి దూరం జరుగుతూ...టీడీపీకి దగ్గర జరుగుతున్నట్లే కనిపిస్తోంది.

క్షేత్ర స్థాయిలో ఆ పరిస్తితి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన దారుణమైన ఫలితాలు ఈ సారి మారేలా ఉన్నాయి. ఎవరు గెలుస్తారనే విషయం పక్కనబెడితే...ఈ సారి మాత్రం రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడవటం గ్యారెంటీ అని చెప్పొచ్చు. గత ఎన్నికల మాదిరిగా వైసీపీ వన్‌సైడ్‌గా విజయం అందుకోవడం మాత్రం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉంటూ..టీడీపీ కేవలం రెండేసి సీట్లు మాత్రమే గెలుచుకున్న జిల్లాల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఆ జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది.

గత ఎన్నికల్లో శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లల్లో టీడీపీ రెండేసి సీట్లు చొప్పున గెలుచుకుంది. మామూలుగా ఈ నాలుగు జిల్లాలు టీడీపీకి అనుకూలమైన జిల్లాలే. కానీ గత ఎన్నికల్లోనే జగన్ గాలిలో టీడీపీ దెబ్బతింది. కానీ ఇప్పుడు ఈ నాలుగు జిల్లాలో వేగంగా పుంజుకున్నట్లే కనిపిస్తోంది.

వైసీపీని దాటేసి లీడ్ తెచ్చుకోలేకపోయినా...ఆ పార్టీకి ఢీ అంటే ఢీ అని పరిస్తితిలో మాత్రం వచ్చింది. నాలుగు జిల్లాల్లో వైసీపీతో పోటాపోటిగా టీడీపీ వచ్చింది. గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాల్లో అయితే వైసీపీని దాటి టీడీపీనే కాస్త లీడ్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే అది ఇప్పుడు ఆ లీడ్ బయటపడేలా లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో బయటపడే అవకాశం ఉంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ సత్తా చాటేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: