గంట గంటకు రాజకీయ వ్యూహాలు మార్చేసే గంటా శ్రీనివాసరావు...మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఇంతకాలం టీడీపీకి దూరంగా ఉన్న గంటా...పార్టీలో కనిపిస్తున్నారు. మొదట నుంచి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి రాజకీయం చేసే గంటా శ్రీనివాసరావు...2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచాక...సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే...అసలు ఈయన టీడీపీలో ఉండరని, వైసీపీలోకి వెళ్లిపోతారని కూడా ప్రచారం జరిగింది..కానీ గంటా పార్టీ మారలేదు...కాకపోతే టీడీపీలో కూడా యాక్టివ్ గా లేరు.

కానీ ఈ మధ్య గంటా సడన్‌గా పార్టీలో యాక్టివ్ అయ్యారు...ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ధన్యవాదాలు చెప్పిన గంటా....ఇంకా తాను టీడీపీలోనే ఉన్నాననే సంకేతం ఇచ్చారు. పైగా ఇటీవల తాను సోషల్ మీడియాలో పెట్టిన ప్రతి పోస్టులో చంద్రబాబు ఫోటో పెడుతున్నారు. తాజాగా అంబేద్కర్ వర్థంతి సందర్భంగా గంటా...విశాఖ నార్త్‌లోని టీడీపీ ఆఫీసుకు వచ్చారు.

అంటే చాలారోజుల తర్వాత గంటా టీడీపీలో యాక్టివ్ అయ్యారు. అయితే ఇప్పుడుప్పుడే టీడీపీకి అనుకూలంగా రాజకీయం ఉండటంతో గంటా...ఆ పార్టీలో యాక్టివ్ అయ్యారని విశ్లేషణలు వస్తున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో గంటా మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. కాకపోతే మళ్ళీ ఆయన నియోజకవర్గం మార్చేస్తారని ప్రచారం జరుగుతుంది.

గంటా మళ్ళీ భీమిలి నియోజకవర్గానికి వెళ్లిపోతారని తెలుస్తోంది. అక్కడ అయితేనే గెలవగలుగుతారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖ నార్త్‌లో గంటాపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకే ఆయన నియోజకవర్గం మార్చేస్తారని తెలుస్తోంది. ఇక నార్త్‌లో విష్ణు కుమార్ రాజుకు ఛాన్స్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. ఆయన బీజేపీతో పొత్తు ఉంటే ఓకే అని లేదంటే విష్ణు...టీడీపీలోకి వచ్చి నార్త్ బరిలో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. నార్త్‌లో విష్ణుకు కాస్త పట్టు ఉంది. 2014లో ఎలాగో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని, కాబట్టి ఆయన నార్త్ బరిలో ఉంటారని తెలుగు తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: