మీ దగ్గర రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా ? మీ శ్రీమతి తన పోపుల పెట్టెలో ఏవైనా రెండువేల రూపాయల నోట్లు దాచి ఉంచుకుని ఉన్నారా ?వెంటనే వాటిని తీసుకెళ్లి బ్యాంకుల్లో జమ చేయండి. ఇ వి త్వరలోనే రద్దయ్యో సూచనలున్నాయి.... ఈ తరహా ప్రచారం దాదాపు రెండు మూడేళ్లుగా జన బాహుళ్యంలో ప్రచారంలో ఉంది. ఎందుకంటే భారత ప్రజలు దాదాపు ఐదేళ్ల క్రితం ప్రధాన మంత్రి హఠాత్తుగా చేసిన ప్రకటన ఇంకా వారిమదిలో నుంచి చెరగి పోలేదు. ప్రస్తుతం అదే పరిస్థితులు వస్తున్నాయా ? కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి చేసిన ప్రకటన అలాంటి అనుమానాలనే రెకెత్తిస్తోంది. రెండు వేల రూపాయల నోట్లు ముద్రణను క్రమంగా తగ్గించినట్లు విత్త మంత్రి నిండు సభలో లిఖిత పూర్వకంగాతెలిపారు.
 ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దాదాపు ఐదేళ్ల క్రితం... అంటే 2016 నవంబర్ నెల ఎమిదవ తేదీ హఠాత్తుగా ఓ ప్రకటన చేశారు. అప్పటి వరకూ చెలామణిలో ఉన్న ఐదు వందలు, వెయ్యిరూపాయల నోట్లను ఒకే ఒక ప్రకటనతో రద్దు చేశారు. నల్లధనం వెలికి తీసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు  ఆయన తన చర్యలను సమర్థించుకున్నారు. ఆ తరువాత వేలాది మంది బ్యాంకులకు, ఏటిఎం  సెంటర్లకు క్యూలు కట్టారు. గంటలు, కాదు రోజుల తరబడి  క్యూలో నిల్చున్నా కూడా సరిపడినంత నగదును వారు పొంద లేకపోయారు. ఇదంతా 2016 నాటి గాయం. ఆ తరువాత కేంద్రప్రభుత్వం తాపీగా... సరికొత్తగా రెండు వేలరూపాయలు, ఐదు వందల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. ఆ తరువాత కొద్ది కాలానికే రెండు వేల రూపాయలనోట్లు రద్దవుతాయనే ప్రచారం ఊపందుకుంది. దీంతో కేంద్రఆర్థిక శాఖ అప్రమత్తమైంది. ఇప్పుడిప్పుడే నోట్ల రద్దు ఆలోచన లేదని ప్రకటించింది.ఆ తరువాత జనం కొంత ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా విత్తమంత్రి  పంకజ్ చోదరి ఎగవ సభలో సభ్యుల ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. రెండు వేలరూపాయల నోట్లను రిజర్వు బ్యాంకు క్రమంగా తగ్గించిందని  పేర్కోంటూ. ఏ ఏ సంవత్సారాలలో ఎంత మేర తగ్గించిందీ వివరించారు. అంతే కాకుండా రిజర్వు బ్యాంక్ వీటిని అచ్చు వేయడం అపివేసిందనీ కూడా స్పష్టంగా చెప్పారు. త్వరలో రెండవేల రూపాయల నోట్లు కనుమరుగు కానున్నట్లు గా కూడా   పంకజ్ చౌదరి నర్మగర్భంగా తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా   ఒక్క దఫాగాకాకుండా విడతల వారీగా  ఈ రెండు వేల రూపాయల నోట్లను తగ్గించినట్లు స్పష్టమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: