కమ్మ సామాజిక వర్గం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత నాలుగున్నర దశాబ్దాల నుంచి కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉన్న సమయంలో ఆ పార్టీ దూకుడుకు బ్రేక్ వేసి తెలుగుదేశం పార్టీ నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని స్థాపించింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్టీ...రామారావు. ఆయన వెనక ఎంతో మంది కమ్మలు బలమైన శక్తిగా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీతో బ్రహ్మాండమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు.

అప్పటినుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. అలాంటి కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు రాజకీయంగా సంకట పరిస్థితి ఎదుర్కొంటోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పతనం అయిపోయింది. చివరకు అక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులే ... ఆ పార్టీకి దొరకటంలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి ఆ పార్టీకి ఇక్కడ కూడా కష్టాలు మొదలయ్యాయి.

సీఎం జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు అన్న చర్చలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు అదే కమ్మ వర్గం నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నాని తో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో చంద్రబాబును టార్గెట్ చేయిస్తున్నారని ప్రచారం కూడా ఉంది. దీంతో ఆ సామాజికవర్గం ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఏకం అవుతున్న పరిస్థితి వచ్చింది. మరోవైపు కమ్మ‌లకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు.

ఏదేమైనా కమ్మలు + కాపులు కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే జగన్ కూడా కొడాలి నాని , వల్లభనేని వంశీ తో చంద్రబాబును దారుణమైన వ్యాఖ్యలతో టార్గెట్ చేయి స్తే అది అంతిమంగా జగన్ కే బూమ‌రాంగ్ అవుతుంద‌న్న రాజకీయ చర్చలు కూడా ఉన్నాయి. ఇలాంటి చర్యల వల్ల జగన్ మునిగిపోతారు అని అంటున్నారు. మరి జగన్ ఈమాట లు చెవికి ఎక్కించుకుంటారో ? లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: