ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు సోము వీర్రాజు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సొంత పార్టీ నేతల్లో కూడా ఇప్పుడు సోము వీర్రాజు ప్రకటనపైనే చర్చ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు చేశారని కూడా అంతా ఆలోచిస్తున్నారు. అసలు సోము వీర్రాజు వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటని కూడా అంతా చర్చ నడుస్తోంది. 2024 తర్వాత రాజకీయాల్లో కొనసాగేది లేదని ఇప్పుడు వీర్రాజు తేల్చేశారు. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే కాస్త బలపడుతోంది. తాజాగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీనే ఇచ్చింది. మరోవైపు జనసేన పార్టీతో కలిసి కూడా ముందుకు నడుస్తోంది.

తొలి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న సోము వీర్రాజు... అటు చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో చంద్రబాబు రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారని... అలాగే మంత్రి పదవి కూడా ఇస్తానన్నారు సోము వీర్రాజు. అయితే తాను మాత్రం బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాని కేవలం బీజేపీ మాత్రమే పాలించగలదని కూడా జోస్యం చెప్పారు సోము వీర్రాజు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు మాటల వెనుక వ్యూహాత్మక ఎత్తుగడులు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో ప్రజల్లో మరింత సానుభూతి పొందేందుకు సోము వీర్రాజు ఈ ప్రకటన చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సహకారంతో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ప్రాధాన్యత వహించారు సోము వీర్రాజు. అటు పార్టీలో దూకుడు కలిగిన నేతగా కూడా ప్రస్తుతం వీర్రాజు గుర్తింపు పొందారు కూడా. పార్టీలో కీలక నేతగా కూడా ఎదిగారు వీర్రాజు. ఇలాంటి సమయంలో రాజకీయ వైరాగ్యం ఎందుకూ అని అంతా ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: