రోడ్డు ప్రమాదాలకు రోడ్డు భద్రతా పరిజ్ఞానం ప్రయాణీకులకు పాదచారులకు సరిగ్గా తెలియకపోవడం ఒక కారణమైతే, అధ్వాన మైన రోడ్లపై ప్రయాణించి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం మరొక పెద్ద కారణం. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లిప్తత, సోయి లేనితనం, కాంట్రాక్టర్ల అవినీతి, సంబంధిత అధికారుల కుమ్మక్కు, రోడ్లు శిథిలమై ధ్వంసమై నాణ్యత లేకుండా పోవడానికి ప్రధాన కారణాలు.
      ఈ కారణాలే కాకుండా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపానం రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారడం కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. యువతను, ప్రజానీకాన్ని, కార్మికులను, శ్రమజీవులను తాగుబోతులుగా మార్చి మద్యపానం అందుబాటులో ఉండే విధంగా చేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా మద్యాన్ని తాగమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే తాగి తాగి ఉన్మాదిగా మారక మరేం అవుతారు?
     హైదరాబాదులో తాగుబోతుల చేతిలో రెండు కుటుంబాల విచ్చిన్నం:
డిసెంబర్ ఆరవ తేదీ సోమవారం హైదరాబాదులోని బంజారాహిల్స్ తోపాటు ఇతర ప్రాంతాలలో పీకలదాకా తాగి నటువంటి తాగుబోతులు కారులో ప్రయాణిస్తూ ఇష్టారాజ్యంగా నడుపుతూ రోడ్డు మీద ప్రయాణిస్తున్న బైక్ లను వేగంగా తాకడంతో రెండు కుటుంబాలు అక్కడి కక్కడే మృత్యువాత పడడం ఆందోళన కలిగించే విషయం. ఒక కుటుంబంలో భార్యాభర్తలు చనిపోగా ముగ్గురు పిల్లలు అనాధలుగా మారిన టువంటి దృశ్యం హృదయ విధారకం.
 మరొక కుటుంబం లోపల కూడా విగతజీవులుగా మారిన టువంటి ఈ రెండు ఉదాహరణలు తాగుబోతుల చేతిలో ఏ రకంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయో తెలపడానికి మచ్చు తునకలు మాత్రమే. ఇలా ప్రతిరోజు దేశ వ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. వీటన్నిటికీ చరమగీతం పడకుండా ప్రభుత్వాలు ఆదాయం కోసమే మద్యానికి ప్రోత్సాహం అందిస్తూ  భవిష్యత్ తరాలకు కావలసినటువంటి యువతను మొగ్గలోనే తుంచి వేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: