భారతదేశంలో సెమీ ఫైనల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పైన అన్ని ప్రధాన పార్టీలు స్పెషల్ ఫోకస్ పెడతాయి. యూపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో... అదే పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతుందని అందరి నమ్మకం. అలాగే యూపీ ఫలితాలు... దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని కూడా ప్రధాన పార్టీలు బలంగా విశ్వసిస్తాయి. అందుకోసమే దాదాపు రెండేళ్లు ముందుగానే యూపీలో రాజకీయ ప్రచారానికి అన్ని పార్టీలు తెరలేపాయి. ఇప్పటికే అధికారంలోకి ఉన్న భారతీయ జనతా పార్టీపై ఎదురుదాడి ప్రారంభించాయి కూడా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా. యూపీలో కాంగ్రెస్ గెలిస్తే... ప్రియాంక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఉందని కూడా ఆ ప్రీట నేతలు ఇప్పటికే ప్రచారం జోరుగా చేస్తున్నారు. అటు ప్రియాంక కూడా యూపీపైనే తన దృష్టి సారించారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదని గతంలోనే ప్రియాంక ప్రకటించారు. తాము ఒంటరిగానే 400 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రియాంక. అలాగే దాదాపు 40 శాతం పైగా సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు కూడా ప్రియాంక గతంలో ప్రకటించారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన యువతులకు ఓ స్కూటీ అందిస్తామన్నారు. ఇప్పుడు తాజాగా మహిళల కోసమే ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు ప్రియాంక. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఏకంగా 40 శాతం కోటా కల్పిస్తామని ప్రకటించారు ప్రియాంక. మహిళలకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మహిళలకు సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 25 హాస్టళ్లు నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే బాలికల కోసం సాయంత్రం పాఠశాలలను తెరుస్తుందని కూడా తెలిపారు. ఇక 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్ ఫోన్లు అందిస్తామన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రియాంక.


మరింత సమాచారం తెలుసుకోండి: