తెలుగుదేశం పార్టీకి కష్టాలు ఇప్పటిలో తగ్గేలా లేవు...వరుసపెట్టి పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి...2019 ఎన్నికల్లో మొదలైన ఈ కష్టాలు..ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దీని వల్ల టీడీపీ చాలాచోట్ల పుంజుకోలేని పరిస్తితిలో ఉంది...అసలు దరిద్రమైన విషయం ఏంటంటే...కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పార్టీకి అడ్వాంటేజ్ రావడం లేదు. పైగా ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత వస్తున్నా సరే...దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టీడీపీ ఉంది.

అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ పరిస్తితి ఇలాగే ఉంది...అసలు పెనుకొండ అంటే టీడీపీకి కంచుకోట..ఇందులో ఎలాంటి డౌట్ లేదు...ఇక్కడ టీడీపీ ఆరుసార్లు గెలిచింది....కానీ లాస్ట్ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటని వైసీపీ బద్దలుగొట్టేసింది...పెనుకొండలో వైసీపీ సూపర్ విక్టరీ సాధించింది...ఇక వైసీపీ తరుపున గెలిచిన శంకర్ నారాయణ....జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా సెటిల్ అయ్యారు. దీంతో పెనుకొండలో వైసీపీ మరింత బలపడే పరిస్తితి వచ్చింది.

కాకపోతే నిదానంగా అక్కడ వైసీపీని ప్రజలు వ్యతిరేకించే పరిస్తితి వస్తుంది. అసలు మంత్రిగా శంకర్ నారాయణ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరు....ఇంకా చెప్పాలంటే ఈయన మంత్రి అనే విషయం రాష్ట్రంలో చాలామందికి తెలియదు. అలాగే ఈయన ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు....పెనుకొండలో ఈ రెండున్నర ఏళ్లలో పెద్దగా అభివృద్ధి జరగలేదు...ఏదో సంక్షేమ పథకాలు మాత్రం ప్లస్ అవుతున్నాయి...పైగా మంత్రి అనుచరుల అక్రమాలు ఎక్కువని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో టీడీపీకి పికప్ అవ్వడానికి మంచి ఛాన్స్ కానీ...పెనుకొండలో టీడీపీ పికప్ అయ్యే పరిస్తితి కనిపించడం లేదు.

ఇటీవల పెనుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఘోరంగా ఓడింది...మొత్తం 20 వార్డుల్లో వైసీపీ 18 గెలుచుకుంటే..టీడీపీ 2 మాత్రమే గెలుచుకుంది. ఇక ఈ విషయంపై చంద్రబాబు....ఇంచార్జ్ బి‌కే పార్థసారథిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం...అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి నేతల ఏమన్నా మిస్టేక్ చేస్తే..మళ్ళీ పెనుకొండ చేజారడం ఖాయమే.  


మరింత సమాచారం తెలుసుకోండి: