మద్యం అంటే ఏపీ....ఏపీ అంటే మద్యం...ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి...అంటే ఏపీలో దొరికే మద్యం ఇంకా ఏ రాష్ట్రంలోనూ..ఏ దేశంలోనూ దొరకదనే చెప్పాలి. అంటే మన రాష్ట్రంలో అంత గోప్ప బ్రాండ్లు ఉంటాయి. పైగా ధరలు కూడా మన రాష్ట్రంలో ఉన్నట్లు ఎక్కడా ఉండవు... సరే ఇదంతా జగన్...జనం కోసమే చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చే ముందు మద్యపాన నిషేధం అని చెప్పారు.

అందుకే అధికారంలోకి వచ్చాక...చెత్త బ్రాండ్లు...అధిక రేట్లు పెంచి మద్య నిషేధం దిశగా వెళుతున్నారని చెప్పొచ్చు. అంటే రేట్లు ఎక్కువ పెంచితే తాగేవారు తగ్గిపోతారని వైసీపీ చెబుతోంది. ఆఖరికి సీఎం జగన్ సైతం చెప్పారు. మరి రేట్లు పెంచారు...తాగేవాళ్లు తగ్గారంటే...మద్యం మీద వస్తున్న ఆదాయాన్ని బట్టి చూస్తే తగ్గలేదనే అనిపిస్తోంది. సరే అయ్యా...రేట్లు పెంచితే పెంచారు...కనీసం మంచి బ్రాండ్లు అయినా ఇవ్వమని మందుబాబులు గోల పెట్టేస్తున్నారు. కానీ అది కూడా చేయడం లేదు...మేం తెచ్చిందే బ్రాండ్...ఇచ్చిందే మందు అన్నట్లుగా పరిస్తితి ఉంది.

పైగా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టే అప్పులు తెచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి...మద్యంతో ఎన్ని రకాలుగా ప్రభుత్వం లబ్ది పొందుతుందో చెప్పాల్సిన పని లేదు. పైగా సరికొత్త ఐడియాలతో ముందుకొస్తుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం అనేక రకాల క్రియేటివ్ ఐడియాలతో ముందుకు నడుస్తోంది. ఎక్కడా లేని విధంగా చెత్తపై పన్ను...ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు రిజిస్టేషన్ చేయిస్తామని పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం...అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు..లేఅవుట్లలో ఐదు శాతం భూమి గానీ, లేదా ఐదు శాతం భూమికి విలువ కట్టి డబ్బులు రూపంలో చెల్లించడంగానీ చేయాలని అంటుంది.

తాజాగా ఏదో మార్కెటింగ్ చేసేవాళ్ళ మాదిరిగా...ప్రభుత్వం...ఎక్సైజ్ అధికారులకు మద్యంలో ఆదాయం ఎక్కువ రావాలని టార్గెట్ పెట్టారు. గత ఆర్ధిక సంవత్సరం సుమారు 20 వేల కోట్ల ఆదాయం రాగా, ఈ సారి మాత్రం 30 వేల కోట్ల ఆదాయం రావాలని టార్గెట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల పని ఒకటే..మందుబాబుల చేత మందు తెగ తాగించాలి. అసలు ఇలాంటి ఐడియాలు జగన్ ప్రభుత్వానికే ఎలా వస్తాయో అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్తితి వచ్చింది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: