ఆస్పత్రి కాదు ఆలయం అని రాయాలి అని చెప్పారు బాలయ్య..ఎందరో చిన్నారులకు అండగా నిలిచారు బాలయ్య. మరోవైపు హోస్టుగానే రాణిస్తున్నారు బాలయ్య.. ఇంకొకవైపు కమర్షియల్ హిట్ సాధించి అఖండతో తనదైన మార్కు పాత్రతో ప్రేక్షకులను అలరించి, దేశ విదేశాల్లోనూ అనూహ్యమయిన కలెక్షన్లు వసూలు అయ్యేలా చేస్తున్నారు బాలయ్య.. ఎన్నో చేదులు దాటాక వచ్చిన సినిమా అఖండ.. రెండేళ్లకు పైగా యూనిట్ కష్టం ఫలించి కమర్షియల్ గా సినిమా ఆశించిన విజయం కాదు ఊహించని విజయం అందుకుని మహమ్మారుల వేళ బిక్కు బిక్కుమంటున్న పరిశ్రమకు కొత్త ఉత్సాహం ఇచ్చింది అఖండ. ఈ సినిమా తరువాత వచ్చే ప్రతి సినిమాకూ ఓ పాజిటివ్ వైబ్ రానుందంటే అందుకు కారణం బాలయ్యే! ఆఖరుగా సినిమా గెలిచింది.. అన్న బోయపాటి మాట ప్రకారం అఖండ సినిమాకు బాక్సాఫీసు కలెక్షన్లు అండగా నిలిచాయి.

డబ్బులు సంపాదించడం అన్నది ఓ ఓటీటీ షోకు కానీ ఓ సినిమా షో కు కానీ ఓ మెజర్మెంట్ పాయింట్ అనుకుంటే ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు బాలయ్య మంచి ఫాంలో ఉన్నారు. అఖండ సీక్వెల్ పనులు కూడా రేపో మాపో మొదలవుతాయి కూడా! అంత స్పీడ్ లో ఉన్నారు బాలయ్య . మరో వైపు ఓటీటీ షో ఆహా కోసం చేస్తున్న షో అన్ స్టాపబుల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. వ్యూయర్ షిప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ సెలబ్రిటీ షో ఇంతటి స్పందనను దక్కించుకోవడం ఇటీవల కాలంలో వచ్చిన అనూహ్య మార్పునకు సంకేతం. త్వరలోనే ఈ షోలో తారక్ కూడా సందడి చేయనున్నారు. చిరు కూడా రానున్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ద వీక్ మ్యాగ్జైన్ అవార్డు వరించింది. దేశంలోనే ఎంపిక చేసిన అత్యున్నత క్యాన్సర్ ఆస్పత్రులలో ఆరో స్థానంలో నిలిచి ఈ ఆస్పత్రి చైర్మన్ బాలయ్యకు ఎనలేని ఆనందాన్ని నింపింది. ఓ విధంగా ఏడాది ముగింపులో వచ్చిన వరుస మూడు విజయాలూ నందమూరి కుటుంబంలో కొత్త సంతోషాలను నింపాయి.

ఇంకా చెప్పాలంటే........


జీవితం తీపి చేదులమయం. సినిమా తీపి చేదుల మయం.. రాజకీయం చేదుతీపిల మయం. మయం అని అంటున్నానంటే అంతా మాయ అని కాదు.. అంతా లయం అని కూడా కాదు.. జీవితాన దేన్నో ఒకదానిని సొంతం చేసుకునే ప్రయత్నం ఒకటి చేయాలంటే కష్టం అన్నది ఓ ప్రామాణిక అవధి కావాలి. కష్టంతో పాటు ఇంకొన్ని విజయం చేకూర్చేందుకు సౌలభ్యకర రీతిలో సహకరించే వనరులు అవుతాయి. బాలయ్య గత కొద్ది కాలంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూశారు. చూస్తున్నారు. ఈ తరుణాన మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ కోరిక మేరకు అన్ స్టాపబుల్ పేరిట చేసిన షో ఆహాలో వస్తోంది.. హిట్ అయింది. అటుపై ఆయన నటించిన అఖండ కమర్షియల్ హిట్ కొట్టింది. కథ పరంగా వంద తప్పులున్నా కళాత్మక రీతిలో వంద తప్పులున్నా అవన్నీ వదిలేసి ఆ చర్చను అటుంచి ఆలోచిస్తే ఈ సినిమా కోట్ల రూపాయలను సులువుగానే వసూలు చేస్తోంది. జగన్ సర్ నిర్ణయా నుసారం టికెట్ రేట్లు నిర్మాత ఆశించిన రీతిలో లేకపోయినా, సినిమా విడుదలయిన మొదటి మూడురోజులూ పెంచుకునే సౌలభ్యం ఇవ్వకపోయినా ఈ సినిమా ఎప్పుడో అందరి అంచనాలనూ కలెక్షన్ల పరంగా దాటేసింది. ఆ విధంగా ఈ సినిమా ఆయన జీవితాన ఓ మైలురాయి.ఆహా షో కూడా అలాంటిదే! ఈ షో కు వచ్చిన మొదటి గెస్ట్ మోహన్ బాబు మొదలుకుని నాని వరకూ, తాజాగా అఖండ యూనిట్ ఇలా అంతా ఎంతో అలరించారు. ఈ విధంగా ఏడాది చివర్లో బాలయ్య రెండు వరుస కమర్షియల్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: