టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ అనుకున్నది సాధించిందా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేసే దిశగా వెళుతున్నారా? రాష్ట్రంపై ఫోకస్ పెట్టాలసిన బాబుని కుప్పానికి పరిమితం చేస్తున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై స్పెషల్ ఫోకస్ చేశారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి...కుప్పం టార్గెట్‌గానే రాజకీయం చేశారు.

వరుసపెట్టి పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటారు. అలాగే ఇటీవల కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని చిత్తుగా ఓడించారు. ఇక ఇక్కడ నుంచి కుప్పంలో వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి వచ్చింది. 2024లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేస్తామనే ధీమాలో ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నిక ముందే నియోజకవర్గంలో పర్యటించారు. అసలు గత ఎన్నికల సమయంలోనే బాబు...కుప్పం మొహం చూడలేదు..అలాంటిది ఇప్పుడు పదే పదే కుప్పం వెళ్ళే పరిస్తితి వచ్చింది.

ఆఖరికి అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్తితి తీసుకొచ్చేశారు. అసలు గత ఏడు ఎన్నికలుగా గెలుస్తున్న బాబుకు...కుప్పంలో ఇల్లు కూడా లేదు. కుప్పం వెళ్ళినప్పుడల్లా ప్రభుత్వం గెస్ట్ హౌస్‌లో ఉండేవారు. కానీ ఈ మధ్య గెస్ట్ హౌస్‌లో ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీంతో బాబు అక్కడ 10 నెలల్లోపు ఇల్లు కట్టాలని ఫిక్స్ అయ్యారు. అలాగే కుప్పంలో తనకు భజన చేస్తూ...ప్రజల్ని పట్టించుకోని నాయకులని పక్కనబెట్టేయాలని ఫిక్స్ అయ్యారు.

అలాగే ఇకపై కుప్పానికి వరుసగా వెళ్లాలని బాబు ఫిక్స్ అయ్యారు. అంటే వైసీపీ ఏ స్థాయిలో కుప్పంపై ఫోకస్ చేసి బాబుని దెబ్బకొట్టాలని చూసిందో..దీని బట్టే అర్ధం అవుతుంది. పైగా బాబుని కుప్పంపైనే ఎక్కువ ఫోకస్ అయ్యేలా చేసి...రాష్ట్రంపై ఫోకస్ లేకుండా చేయాలని చూసినట్లు కనబడుతోంది. అందుకే ఇలా బాబుని కుప్పం వరకే కట్టడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కుప్పంలో బాబుని దెబ్బకొట్టడంలో వైసీపీ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: