వ్యవసాయ పొలాల చుట్టు తిరుగుతూ అనునిత్యం రైతులకు  పంటలపై అవగాహన కల్పిస్తూ, సమయానికి ఎలాంటి ఎరువులు వేయాలో తెలియజేస్తూ రైతుల తలలో నాలుక లాగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరో కొత్త పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారంతా ఇప్పటికే ఎన్నో పనులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మళ్లీ ఇలాంటి రూల్స్ తీసుకువచ్చి మమ్మల్ని ఏం చేస్తారని అంటున్నారు.. ఇంతకీ వారికిచ్చిన పని ఏమిటి.. తెలుసుకుందాం..! మనం బుక్కెడు అన్నం తింటున్నాము అంటే దానికి కారణం రైతన్న.. రైతన్న లేకుంటే దేశ భవిష్యత్తు లేదు. అసలు ప్రపంచ మనుగడ లేదు.. ఇలాంటి రైతన్న కోసం వ్యవసాయ శాఖ ఎల్లప్పుడు కష్టపడుతూ రైతు విత్తు నాటిన నుంచి పంట నమ్మే వరకు దాని వెనుక వ్యవసాయ అధికారుల హస్తం ఉంటుంది.

 అయితే ఈ వ్యవసాయ అధికారులు, వారికి ఉన్నటువంటి పనులను పక్కనపెట్టి మరో కొత్త పనిని ముందుకు తీసుకు వచ్చింది వ్యవసాయ శాఖ. ఆ పనులను మరిచిపోయి కోతుల లెక్కలు చెప్పాలని అడిగాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాసంగి సీజన్ లో ప్రారంభమైనటువంటి పంటల ప్రణాళికలు రూపొందించలేదు. ఏ సీజన్లో అయినా పంట లెక్కలు కూడా సరిగా ఉండటం లేదు. రైతు బంధు, బీమాలో కూడా అలసత్వం. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ శాఖలో జనాభాకు తగ్గట్టుగా అధికారులు లేకపోవడం. దీంతో ఎక్కువ పని భారంతో ఇలాంటి పనులు వెనుకబడి పోతున్నాయి. దీనికి తోడు మళ్ళీ కోతుల లెక్కలు చెప్పాలని, అలాగే కోతుల వల్ల పంట నష్టం ఎంత జరుగుతుందో అంచనా వేయాలని, గ్రామాల్లో కోతులు  ఎక్కడెక్కడ ఉంటున్నాయో, తెలుసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అడవుల్లోనా, రోడ్ల మీదనా, గుట్టల మీదనా, లేదా వాటికి ఏమైనా గెస్ట్ హౌస్ లు ఉన్నాయా అనే విషయాలు ఏ ఈఓలు లెక్కలతో సహా చెప్పాలని దీనికోసం అగ్రికల్చర్ బుకింగ్ అనే వెబ్ సైట్ లో కొత్తగా మంకీ మెనస్ సర్వే పేరుతో ఒక ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రతి గ్రామంలో ఏ ఈఓలు సర్వేలు చేసి, కోతులు నివాసం ఉండే ప్రాంతాలకు వెళ్లి తెలుసుకొని అందులో వివరాలు నమోదు చేయాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఎందుకంటే కోతులతో పంట నష్టం జరుగుతోందని ఈ సర్వే చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

అలాగే రైతులు ఈ కోతులను పంట నాశనం చేయకుండా ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారో మంకీ గనులు, నెట్ లు, సోలార్ పెన్సింగ్ లు , కొండముచ్చులు, దిష్టి బొమ్మలు ఇలా ఇంకేమైనా పద్ధతులు పాటిస్తున్నారా అనేదానిపై సర్వే చేయాలని తెలుస్తోంది. ఈ విషయంపై ఏఈఓ లు  ఇప్పటికి ఆందోళన పడుతున్నారు. రైతు పంట వేసిన అప్పటినుంచి, అమ్ముకునే వరకు అనేక పనులు చేస్తున్నామని, దీంతో సిబ్బంది కొరత ఉందని, అయినా నెట్టుకొస్తున్నాము అని, మళ్లీ కొత్తగా ఈ కోతుల  లెక్కలు చెప్పడం ఏంటని, వాటి లెక్కలు ఎలా  తీసుకురావాలని, ఇప్పటికే వ్యవసాయం బాగుకోసం డిగ్రీలు, పీజీలు చేస్తే మాతో ఎక్కువగా  డేటా ఎంట్రీ పనులు మాత్రమే చేయిస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: