తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టింది, పెరిగింది, విద్యాభ్యాసం, రాజకీయ అరంగేట్రం, రాజకీయా ప్రస్తానం... ఇలా అన్నీ ఆ జిల్లాతోనే ముడి పడి ఉన్నాయి. ఏకంగా 35 ఏళ్లుగా అదే జిల్లా నుంచి చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా. ఇక గత 5 విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అయితే నామినేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు కనీసం నియోజకవర్గంలో కూడా కాలు పెట్టటం లేదు. పేరుకే చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరు. కానీ అక్కడ ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే. సొంత జిల్లాలో తిరుగులేకుండా ఎదిగింది వైఎస్ఆర్ కుటుంబం. కడప జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ కుటుంబం పట్టు సాధించింది. గత ఎన్నికల్లో అయితే... కనీసం ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ చంద్రబాబు పరిస్థితి మాత్రం పూర్తిగా రివర్స్. 2019 ఎన్నికల్లో కేవలం చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగిలిన వారంతా ఓడిపోయారు. ఇక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయితే తెలుగుదేశం పార్టీ గెలుపు కష్టమే.

ఇక చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఓడించేందుకు వైసీపీ కంకణం కట్టుకుంది. అందుకే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కుప్పంలో పాగా వేసింది వైసీపీ. కుప్పం పురపాలికపై తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. అటు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ చంద్రమౌళి కుమారుడు భరత్‌ను ఎమ్మెల్సీ చేశారు జగన్. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి అనేలా పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మునిసిపల్ ఎన్నికల పోస్టుమార్టం సమయంలో కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటానని కూడా ప్రకటించారు. అది కూడా కేవలం పది నెలల్లోనే పూర్తి చేస్తారట. ఇకపై వీలైనన్ని ఎక్కువ రోజులు కుప్పంలోనే ఉంటానని తేల్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: