కేంద్రం రైతులపై  మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  అన్నారు. ఎరువుల ధరల పెంపుపై ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖను రాశారు. తీవ్రంగా ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని  కెసిఆర్ లేఖలో రాశారు. వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులను రెట్టింపు చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని కేసీఆర్ కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం రైతులను వారి పొలాలలోనే కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి కేంద్రం, ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడం అనేది దుర్మార్గమని కడిగిపారేశారు. మోడీ ప్రభుత్వం పచ్చి రైతుల వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు.

దేశంలో రైతులను  బతుకునిచ్చే పరిస్థితి లేదని, కరెంటు మోటార్లు బిగించి మళ్లీ బిల్లులను వసూలు చేయడం అనేది దుర్మార్గమని, ఎన్ఆర్జి ఈ నీ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయమంటే నాన్చడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనకుండా ఇబ్బంది పెట్టడం వెనక కుట్ర దాగి ఉందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరియు అనుబంధ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు  కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని  విమర్శించారు.


బిజెపిని కూకటివేళ్లతో సహా పెకిలించి  విసిరి కొట్టాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. అలాగే దశాబ్దాలుగా కొనసాగుతున్న టువంటి ఎరువుల యొక్క సబ్సిడీలను ఎత్తివేసి రైతు వ్యవసాయం చేయకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగమంతా తిరగబడే రోజులు వస్తాయని అన్నారు. నాగళ్లు ఎత్తి తిరగబడితే తప్ప మన వ్యవసాయాన్ని కాపాడుకోలేని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం  వెంటనే ఎరువుల ధరలు తగ్గించి రైతులను కాపాడాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడాతామని హెచ్చరించారు. కేంద్ర కుట్రలను రైతన్నలు అర్థం చేసుకొని  ధరలు తగ్గించే వరకు పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: