ఏపీలో ఓ వైపు అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్‌లో నడుస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో మరోవైపు టీడీపీ-జనసేనల పొత్తు విషయంపై చర్చ కాస్త రచ్చగా మారింది. వైసీపీకి చెక్ పెట్టాలంటే జనసేన సపోర్ట్ తప్పనిసరి అని టీడీపీ భావిస్తుంది. పవన్‌ని కలుపుకుంటే జగన్‌కు ఈజీగా చెక్ పెట్టొచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే పవన్‌తో కలవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ పవన్ వైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని అర్ధమవుతుంది.

అదే సమయంలో చంద్రబాబు పొత్తు విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా లవ్ స్టోరీ రూపంలో చెప్పారు. వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదని అన్నారు. అంటే బాబు పొత్తుకు రెడీగా ఉన్నా...పవన్ రెడీగా లేరని అర్ధమవుతుంది. అయితే బాబు లవ్ మాటలపై జనసేన నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొందరు అంటుంటే..మరికొందరు ఏమో పవన్‌ని సీఎం అభ్యర్ధిగా ఫిక్స్ చేస్తే పొత్తు పెట్టుకుంటామని మాట్లాడుతున్నారు.

ఇక ఇక్కడ జనసేన వర్షన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి బాబు ఒక రాయి వేసినట్లు కనిపిస్తోంది. ఇక బాబు మాటల ట్రాప్‌లో జనసేన నేతలు పడినట్లు ఉన్నారు. అందుకే తాజాగా కూడా పవన్, పొత్తుల గురించి స్పందించవద్దని, ఎదుటవారి మైండ్ గేమ్‌లో పావులు కావొద్దని మాట్లాడారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని, తర్వాత పరిస్తితులని బట్టి అందరం నిర్ణయం తీసుకుని పొత్తుల విషయం మాట్లాడదామని, ఈలోపు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయాలని పవన్, జనసేన నాయకులకు సూచించారు.

అయితే ఇక్కడ టీడీపీతో పొత్తు విషయంలో పవన్‌కు కూడా ప్రేమ ఉందని తెలుస్తోంది. అందుకే డైరక్ట్‌గా పొత్తు వద్దని మాత్రం చెప్పడం లేదు...కానీ తర్వాత పరిస్తితులని బట్టి పొత్తు గురించి చర్చిద్దామని అంటున్నారు. అంటే ఇక్కడ పవన్‌కు పొత్తు పెట్టుకోవాలనే ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి పవన్ పొత్తుకు అనుకూలంగానే ఉన్నారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: