ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో విస్తరణవాద ధోరణితో వ్యవహరించిన చైనా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన ప్రతిష్టంభన కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే చైనా సైన్యం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు రావడంతో భయపడుతుంది అనుకున్న భారత సైన్యం ఎదురు తిరిగి నిలబడింది. అంతేకాకుండా దూకుడుగా వ్యవహరించి చైనా కు సంబంధించిన  ఒక కొండ ప్రాంతాన్ని కూడా అది భారత సైన్యం తమ అధీనంలోకి తెచ్చుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక గత కొన్ని నెలల నుంచి భారత్ చైనా సరిహద్దులో చైనా ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అటు సైన్యంతో కవ్వింపు లకు పాల్పడుతూనే  ఉంది.


 దీంతో సరిహద్దుల్లో ఎప్పుడు యుద్ధం తలెత్తుతుందో అన్న విధంగానే మారిపోయింది  ప్రస్తుతం పరిస్థితి.  ఇటీవలి కాలంలో ఇక చైనా సైన్యానికి మౌలిక వసతులు కల్పిస్తూ కొత్త నిర్మాణాలు కూడా చేపడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవల పాంగాంగ్ సరస్సు పై చైనా వంతెన నిర్మించి నట్లు ప్రకటించడం.. ఏకంగా ఆ దేశపు జాతీయ జెండాను ఎగరవేయడం  హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  భారత్ కూడా  సైన్యాన్ని కూడా మొహరిస్తూ వస్తోంది. అదే సమయంలో అధునాతనమైన ఆయుధాలను కూడా సరిహద్దుల్లో మొహరిస్తోంది. దీంతో భారత్ చైనా సరిహద్దు లో రోజురోజుకు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయ్.



 అయితే సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు శత్రుదేశాల దాడిని ఎంత వెంటనే గుర్తించేందుకు భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్నది అర్ధమవుతుంది. ఇటీవల భారత్ చైనా సరిహద్దు లో సరికొత్త రాడార్ లను మోహరించింది భారత్. ఇక 250 కిలోమీటర్ల అవతల నుంచి వస్తా వస్తున్నా యుద్ధ విమానాలను క్షిపణులను గుర్తిస్తుంది. b18 అనే రాడార్ నీ ప్రస్తుతం మోహరిస్తూనట్లు తెలుస్తోంది. అయితే శబ్దవేగం కంటే కూడా ఎంతో వేగంతో ప్రయాణించేటువంటి స్టెల్త్ ఫైటర్స్ ను కూడా ఈ రాడార్ గుర్తిస్తుందట. ఇక ఈ రాడార్ మోహరింపు  భారత ఆర్మీ మరింత పటిష్టంగా మారింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: