ఏపీ కమ్మ వర్గం నేతలని దెబ్బకొడితే దాదాపు టీడీపీని దెబ్బకొట్టినట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి కమ్మ నేతలే ప్రధాన బలం. ఆర్ధికంగా, సామాజికంగా కమ్మ వర్గం వల్లే టీడీపీకి బలం ఉందని చెప్పొచ్చు. అందుకే కమ్మ నేతలకు చెక్ పెడితే ఆటోమేటిక్‌గా టీడీపీకి చెక్ పడినట్లే. అందుకే 2019 ఎన్నికల్లో వైసీపీ ఇదే ఫార్ములాని ఫాలో అయింది. ఎక్కడకక్కడ బలంగా ఉన్న కమ్మ నాయకులకు చెక్ పెట్టుకుంటూ వచ్చింది.

అసలు ఓటమి ఎరగని కమ్మ నేతలకు సైతం చెక్ పెట్టేసింది. జగన్ గాలిలో బడా బడా కమ్మ నేతలంతా ఓడిపోయారు. ఈ ప్రభావం టీడీపీపై కూడా బాగా పడింది...టీడీపీ కూడా చిత్తుగా ఓడి అధికారానికి దూరమైంది. అయితే ఇదే ఫార్ములాని ఇప్పుడు టీడీపీ అమలు చేయాలని చూస్తుంది. ఇక వైసీపీని రెడ్డి వర్గాన్ని సెపరేట్‌గా చూడటానికి లేదు. వైసీపీలో రెడ్డి వర్గం డామినేషన్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇక రెడ్డి నేతలే వైసీపీ ప్రధాన బలం.

వారు బలంగా ఉంటేనే వైసీపీ బలంగా ఉంటుంది.  ముఖ్యంగా ఆరు జిల్లాల్లో రెడ్డి వర్గం నేతల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వారే వైసీపీని నిలబెడుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి డామినేషన్ రెడ్డి నేతలదే అని చెప్పాల్సిన పని లేదు. ఈ ఆరు జిల్లాల్లో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువ. పైగా ఆరు జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం కూడా రెడ్డి నేతలే.

అందుకే వారికి చెక్ పెట్టాలని టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే వైసీపీ, కమ్మ నేతలకు చెక్ పెట్టినంత ఈజీగా, టీడీపీ...రెడ్డి నేతలకు చెక్ పెట్టడం అంత సులువు కాదు. ఆ రెడ్డి ఎమ్మెల్యేలపై బలమైన అభ్యర్ధులని పెట్టాలి. ఇప్పుడు అదే పనిలో టీడీపీ ఉంది. వారికి ఎలాగైనా చెక్ పెట్టి, వైసీపీకి కూడా చెక్ పెట్టాలని, అలాగే గత ఎన్నికల రివెంజ్‌ని కూడా తీర్చుకోవాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: