ముద్రగడ పద్మనాభం...పరిచయం అక్కరలేని పేరు. ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పేరు వింటే చాలు కాపు ఉద్యమ నేత అని అందరికీ గుర్తొచ్చేస్తారు. అయితే ఈయన గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లో పనిచేసిన నాయకుడు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసిన నేత. అయితే వైఎస్సార్ ఉన్నంత వరకు కాంగ్రెస్‌లో కొనసాగిన ఈయన...ఆయన చనిపోయాక రాజకీయాలకు దూరమయ్యారు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ నుంచి ముద్రగడ కాపు ఉద్యమం మొదలైంది. చంద్రబాబు కాపులని బీసీల్లో చేరుస్తానని హామీ ఇవ్వడంతో, ఆ హామీ నెరవేర్చెలా చేయడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయితే ఈయన ఉద్యమం కాపుల కోసం కంటే పరోక్షంగా చంద్రబాబుని గద్దె దించి, జగన్‌ని గద్దె ఎక్కించడానికి ఉపయోగపడిందనే చెప్పొచ్చు.

అసలు టీడీపీ శ్రేణులైతే ముద్రగడ పక్కా జగన్ మనిషి అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇక ముద్రగడ అనుకున్నట్లుగానే 2019 లో చంద్రబాబు గద్దె దిగిపోగా, జగన్ సీఎం పీఠం అధిరోహించారు. ఒకవేళ ముద్రగడ కాపుల కోసం పొరాడి ఉంటే...జగన్ అధికారంలోకి వచ్చాక కూడా పోరాడాలి. కానీ జగన్ అధికారంలోకి రాగానే ముద్రగడ ఉద్యమాన్ని వదిలేశారు. ఇక ఇక్కడే అసలు విషయం అర్ధమైపోయింది. ఈయన జగన్ కోసమే పనిచేశారని క్లారిటీ వచ్చింది.


కాకపోతే తాను ఉన్నానని చెప్పడానికి అప్పుడప్పుడు లేఖలు రాస్తూ ఉంటారు. ఆ లేఖల్లో చంద్రబాబుపై ద్వేషం, జగన్‌పై ప్రేమ కనిపిస్తాయి. అయితే మళ్ళీ జగన్‌ని అధికారంలోకి తీసుకురావడానికి ముద్రగడ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. జనసేన ఎలాగో టీడీపీతో కలిసేలా ఉంది కాబట్టి, కాపుల ఓట్లని చీల్చి జగన్‌కు లాభం జరిగేలా చేయడానికి ముద్రగడ కొత్త పార్టీ పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సారి ముద్రగడ ఎన్ని ప్రయోగాలు చేసిన ఫ్యాన్‌ని లేపడం మాత్రమే కష్టమే అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: