ఏపీ సీఎం జగన్ మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసుగా మారుస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం సర్వీసు నిబంధనలు,  పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.


ఇకపై మహిళా పోలీసు విభాగంలో ఐదు కేటగిరీలుగా పోస్టులు ఉంటాయి. అవేంటంటే.. మహిళా పోలీసు ఇనస్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీసు సబ్ ఇనస్పెక్టర్, మహిళాపోలీసు ఏఏస్ఐ, సీనియర్ మహిళా పోలీసు, మహిళా పోలీసుగా ఈ కొత్త ఉద్యోగాల కేటగిరీలను డిసైడ్ చేశారు.  అంతే కాదు.. మహిళా పోలీసు విభాగంలో 90 శాతం పోస్టులు డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారానే భర్తీ చేస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది.


అయితే.. మిగిలిన పది శాతం మాత్రం మహిళా హోం గార్డుల ద్వారా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. వీటిలో 5 శాతం మేర, గ్రామవార్డు మహిళా వాలంటీర్ల నుంచి మహిళా పోలీసు శాఖలోకి తీసుకుంటారు. 5 శాతం మందిని మహిళా పోలీసు విభాగంలో భర్తీ చేస్తామని  హోంశాఖ ప్రకటించింది.


జగన్ అధికారంలోకి వచ్చాక అనేక కొత్త ఉద్యోగ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అందులో ఈ మహిళా పోలీసు విభాగం ఒకటి కాబోతోంది. ఇప్పటికే జగన్ గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ సేవలను గ్రామాలకు సులభంగా అందాలన్న ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో కొత్త ఉద్యోగాలను కల్పించారు. ఇలా ఉద్యోగ వ్యవస్థలో కొత్త ట్రెండ్‌కు జగన్ శ్రీకారం చుడుతున్నారు. అలాగే జగన్ పోలీసు శాఖలో దిశ పోలీస్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ కొత్త మార్పులు ప్రజలకు ఎంత వరకూ చేరవు అవుతాయి.. అవి ఎంత వరకూ ఉపయోగపడతాయన్నది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: