చిరంజీవితో పాటు ఇంకొంద‌రు కూడా వైసీపీకి అనుగుణంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అండ‌గా ఉంటే అప్పుడు జ‌న‌సేన ఏం కావాలి ?
ఇదే ప్ర‌శ్న‌తో ట్రోల్స్ మొద‌ల‌యిపోయాయి.అన్న‌య్యా! వాళ్ల‌నూ వీళ్ల‌నూ న‌మ్మొద్దు ప్లీజ్ అని మెగాభిమానులు మొర‌పెట్టుకుంటున్నారు.ఇదే స‌మ‌యంలో అన్న‌య్య ఏం చేసినా ఇండస్ట్రీ మంచి కోస‌మే అన్న భావ‌న ఒక‌టి స్థిరం చేసే ప్ర‌య‌త్నం ఇంకొంద‌రు నెటిజ‌నులు చేస్తుండ‌డంతో ఇవాళ సోష‌ల్ మీడియా చాలా విష‌యాల‌ను మోసుకుని వెళ్తోంది.

జ‌న‌సేన అభిమానుల్లో క‌ల‌వ‌రం రేగుతోంది. చిరంజీవి,జ‌గ‌న్ భేటీ నేప‌థ్యంలో తాము ఏమ‌యిపోతామో అన్న ఆందోళ‌న వారిలో క‌నిపిస్తోంది.కాపు సామాజిక‌వ‌ర్గ పెద్ద‌గానే కాకుండా త‌మ కుటుంబాల‌కూ పెద్ద‌గానే భావించే పెద్ద‌న్న‌య్య చిరు ఓ మెట్టు దిగి జ‌గ‌న్ ను క‌ల‌వ‌డం వాళ్లకు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.దీంతో  చిరును ట్రోల్ చేస్తున్నారు కొంద‌రు.సుద్దులు చెబుతున్నారు.నాల్రోజులు ఆగితే మంచి రోజులు వ‌స్తాయ‌ని,వైసీపీ ప్ర‌భుత్వం ఎల్ల‌కాలం ఉండిపోద‌ని, క‌నుక చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌కుండా క్రియాశీలక రాజ‌కీయాల్లో యాక్టివ్ అయి వైసీపీకి ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని కొంద‌రు మెగాభిమానులు కోరుతున్నారు.

విమ‌ర్శ‌లున్నా ప‌ట్టించుకోడు
ఇండ‌స్ట్రీ క్షేమం కోసం ఓ మెట్టు దిగే
ఉన్నాడు..ఉంటాడు కూడా!

ఇవాళ లంచ్ మీట్ కు సిద్ధం అవుతున్నారు అటు జగన్..ఇటు చిరు.నరసాపురం ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఆయనను ఈయన పిలిచారని,అన్నయ్యా మీరు వెళ్లవద్దు అని పదే పదే వేడుకుంటున్నా జనసేన అభిమానులు.అలా పదే పదే వెళ్తే జనసేన జనంలో చులకన అయిపోతుందని,ఆ విధంగా వెళ్లకుండా హుందాతనం చాటుకోవాలని కోరుతున్నారు పవన్ అభిమానులు.కానీ చిరు వర్గం మాత్రం తనదైన వాదన ఒకటి వినిపిస్తోంది.ఇంతవరకూ ఎవ్వరూ ఇండస్ట్రీ తరఫున సరిగా మాట్లాడే వారే లేకపోవడంతో సమస్య పరిష్కారంలో ప్రతిష్టంభన నెలకొని ఉందని,అదే కాస్త ఎవ్వరైనా చొరవ చూపి సానుకూలంగా మాట్లాడి ఉంటే ఇప్పటికే కొంత పరిష్కారం అయి ఉండేదని అభిప్రాయపడుతోంది.ఏదేమైనప్పటికీ అన్నయ్య వెళ్లి జగన్ తో భేటీ కావడం మంచిదేనని అంటోంది.కేవలం కాపు ఓట్ల కోసమే ఆ కుల పెద్దగా చిరును చూపి నరసాపురంలో మంచి మార్కులు కొట్టేయాలని జగన్ భావిస్తున్నారు అని ఇంకొందరు పరిశీలకులు అంటున్న మాట.ఈ మాట ఎలా ఉన్నా ఇప్పుడు చిరంజీవి  మాత్రం ఇవేవీ పట్టించుకునే దిశలో లేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: