చిత్ర సీమ‌కు సంబంధించి ఎప్ప‌టి నుంచో ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి.ఆఖ‌రికి జ‌గ‌న్ తో భేటీ అనంత‌రం కూడా తానొక బిడ్డ‌గానే వ‌చ్చాను కానీ పెద్ద‌గా కాద‌ని పున‌రుద్ఘాటించారు.చిత్ర సీమ‌కు అండ‌గా నిలిచి, క‌ష్ట‌కాలంలో కొండంత భ‌రోసా ఇవ్వాల‌నే తాను కోరాన‌ని మీడియాతో చిరు చెప్పారు.త్వ‌ర‌లోనే టికెట్ ధ‌ర‌ల‌కు సంబంధించి ఓ డ్రాఫ్ట్ రెడీ కానుంద‌ని మాత్రం స్ప‌ష్ట‌త ఇచ్చారు. సీఎంతో చ‌ర్చ‌ల అనంత‌రం ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో వీటన్నింటిపై చ‌ర్చించాక మ‌రికొన్ని విష‌యాలు జోడించి మ‌ళ్లీ చ‌ర్చ‌ల‌కు త్వ‌ర‌లోనే రానున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.ఈ సారి కూడా సీఎం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వ‌స్తాన‌ని అది ఆయ‌న నిర్ణ‌య‌మేన‌ని వెల్ల‌డి చేశారు. అదేవిధంగా ఈ సారి ఎక్క‌డ కలుద్దాం అంటే ఎందుక‌న్నా అక్క‌డా ఇక్క‌డా హాయిగా మీరు మా ఇంటికి వ‌చ్చి మ‌ధ్యాహ్నం వేళ భోజ‌నం చేసి వెళ్లండి అని జ‌గ‌న్ అన్నార‌ని, అది వారి అతిథి మ‌ర్యాద‌కు సంస్కారానికి గొప్ప తార్కాణమ‌ని సీఎంను ప్ర‌శంసించారు చిరు.

ఒక‌రు వచ్చారు ఒక‌రు పిలిచారు
పిలిచిన అతిథికి క‌డుపు నిండా అన్నం పెట్టారు
ఆక‌లి తీర్చి స‌మ‌స్య‌లు విని పంపారు
ఇక నిర్ణ‌యం వెలువ‌డ‌డ‌మే త‌రువాయి!


మ‌రో రెండు మూడు వారాల్లోస‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని చెబుతున్నారు చిరంజీవి.ఇవాళ అమ‌రావ‌తిలో సీఎం జ‌గ‌న్ కు క‌లిశాక  కొన్ని కీల‌క విషయాలు మీడియాకు వెల్లడించారు.అవేంటో ఆయ‌న మాటల్లోనే..చిత్ర సీమ‌కు సంబంధించి అన్ని స‌మ‌స్య‌లు వివ‌రించాను.ముఖ్యంగా నిర్మాత‌ల ప‌రంగా,ఎక్జిబిష‌న్ రంగంలో ఉన్న వారి పరంగా తలెత్తుతున్న స‌మ‌స్య‌లు వారికి చెప్పాను.పైకి క‌నిపించేంత గొప్ప ప్ర‌పంచం అయితే ఇది కాదు..కరోనా స‌మ‌యంలో అనేక అవ‌స్థ‌లు ప‌డి కార్మికులు తిండికి గ‌తిలేని రోజులున్నాయి. మేం మా త‌ర‌ఫున మూడు విడ‌త‌లుగా కార్మికుల‌ను ఆదుకున్నాం.నిత్యావ‌స‌ర స‌ర‌కులు అందించి వారికో చేయూత ఇచ్చాం. మీరు మా అంద‌రి స‌మ‌స్య‌లు పరిగ‌ణించి ప‌రిష్కారం చూపాలి.. అని జ‌గ‌న్ ను వేడుకున్నాన‌ని అన్నారు.త‌రువాత బేటీ ఎప్పుడ‌ని అడిగితే ఆ నిర్ణ‌యం కూడా సీఎందేన‌ని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp