భారత రక్షణ రంగాన్ని పటిష్టం వంతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా భారత వాయుసేన లో సరికొత్త ఆయుధాలు చేర్చడానికి కంకణం కట్టుకున్న భారత ప్రభుత్వం దీన్ని ఒక యజ్ఞంలా చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇతర దేశాలనుంచి ఎంతో అధునాతనమైన ఆయుధాలను కొనుగోలు చేస్తూ భారత అమ్ములపొదిలో చేర్చుతుంది భారత ప్రభుత్వం. ఇక ఈ ఆయుధాలు కొనుగోలు చేయడానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తూ ఉండడం గమనార్హం. ఒకవైపు భారత రక్షణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలకు పూర్తి స్థాయి లో సహకారం అందిస్తూ దేశంలో ఎన్నో రకాల ఆయుధాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది భారత ప్రభుత్వం. ఇప్పటికే భారత రక్షణ పరిశోధన సంస్థ ఎన్నో రకాల క్షిపణి వ్యవస్థలను  తయారు చేసింది. అదే సమయంలో లైట్ వెయిట్ యుద్ధ విమానాలను కూడా తయారు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించడం కూడా ప్రారంభించింది.అయితే ఒక వైపు భారత ఆయుధాలను విదేశాలకు విక్రయిస్తూనే ఫ్రాన్స్ నుంచి అత్యాధునికప్రపంచ యుద్ధ విమానాలను భారత అమ్ములపొదిలో చేర్చుకొంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఎన్నో రాఫెల్  యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో కి వచ్చి చేరాయి. ఇప్పుడు ఒప్పందం ప్రకారం చివరి బ్యాచ్ భారత్ కి త్వరలో రాబోతుంది అని తెలుస్తోంది. అయితే ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎప్పుడో రావాలి ఉన్నప్పటికీ నాలుగు యుద్ధ విమానాల్లో భారత సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి. ఇప్పుడు భారత్కు పంపించేందుకు ఫ్రాన్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన లో చేరితే భారత రక్షణ రంగం మరింత పటిష్టవంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: