ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడుతున్నారో తనకే అర్ధం కానట్లుంది. తాజాగా 2009లో ఓటమికి చిరంజీవే కారణమని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు చాణుక్యుడంటు జరుగుతున్న ప్రచారం నిజమేనా అడే డౌట్ పెరిగిపోతోంది.  ప్రతికూల పరిస్ధితులను కూడా తనకు అనుకూలంగా మలచుకుని సమస్య నుండి గట్టెక్కే వాళ్ళనే చాణుక్యుడంటారు. అయితే చంద్రబాబులో అలాంటి లక్షణాలు ఎప్పుడూ కనబడలేదు. ఎందుకంటే గెలిస్తే తన ప్రతిభ వల్లే గెలిచామంటారు. ఓడిపోతే ఎదుటివాళ్ళ చేతకానితనం వల్లే అంటారు.




ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం సంగతిని చంద్రబాబు ఇపుడు గుర్తు చేసుకుని మెగాస్టార్ ని నిందించటంతోనే ఆ విషయం నిరూపణవుతోంది. ఓటమికి పలానా వ్యక్తి కారణమని చెబుతున్న చంద్రబాబు తన గెలుపుకు మాత్రం పలానా వాళ్ళు సహకరించారని ఎప్పడూ చెప్పలేదు. కుప్పంలో వరసబెట్టి ఓటములకు పార్టీ నేతలే కారణమన్నారు. పార్టీలో కోవర్టులున్నారంటు మండిపోయారు. జనాలు డబ్బులు తీసుకుని వైసీపీకి ఓట్లేశారంటు దెప్పి పొడిచారు. మరంతకు ముందు వరసగా ఏడుసార్లు ఎవరు ఓట్లేస్తే, ఎవరు పనిచేస్తే గెలిచారు ?




నిజంగా పుట్టి పెరిగిన ఊరిని ఎవరు వదిలేసి దూరంగా వెళ్ళిపోరు. రాజకీయాల్లో అయితే సొంత నియోజకవర్గం మారటమంటే చాలామంది ఏమాత్రం ఇష్టపడరు. కానీ చంద్రబాబు మాత్రం చాలా సులభంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేసి జిల్లాలో ఎక్కడో మారుమూల విసిరేసినట్లుండే కుప్పంకు  వెళ్ళిపోయారు. చంద్రగిరిలో ఒకసారి పోటీచేసి గెలిచి రెండోసారి ఓడిపోగానే నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేసినట్లు ?  తన మాటలు చెల్లుబాటు కావని అర్ధమైన తర్వాతే కుప్పంకు చంద్రబాబు వలసవెళ్ళిపోయారు.




ఇక 2019లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత నుండి పార్టీ గ్రాఫ్ పడిపోతోందే కానీ ఎక్కడా లేవలేదు. ఇపుడు కూడా పార్టీలో కోవర్టులున్నారని, ప్రలోభాలకు లొంగిపోయి అధికారపార్టీ నేతలకు సాయం చేస్తున్నారనే అంటున్నారు. అసలు కోవర్టుల వ్యవస్ధకు, ప్రలోభాలకు ఆధ్యుడు తానే అన్న విషయాన్ని కన్వీనియంట్ గా చంద్రబాబు మరచిపోతున్నారు. పొత్తులు లేకపోతే ఒక్క ఎన్నికలో కూడా గెలవలేని చంద్రబాబు చాణుక్యుడని ప్రచారం చేయించుకోవటమే ఆశ్చర్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: