మాస్ అంటే నాగ్
నాగ్ అంటే సంక్రాంతికి కింగ్
కింగ్ మ‌రియు లిటిల్  కింగ్
చేసిన మానియా ఈ సినిమా

 
అవును! అంతా అనుకున్న విధంగానే అక్కినేని కుటుంబానికి ఈ పండుగ భ‌లే క‌లిసొచ్చింది.నాగ్ మార్క్ న‌ట‌న‌కూ, ఆయ‌న మార్క్ మాసివ్ లుక్ కు భ‌లే క్రేజ్ వ‌స్తోంది.సోగ్గాడేకు కంటిన్యూష‌న్ గా ఉంటూనే మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అని అనిపించుకునేందుకు ఈ సినిమా రూపంలో డైరెక్ట‌ర్ చేసిన ప్ర‌తి ప్ర‌య‌త్నం కూడా బాగుంటుంది.ఎఫెర్ట్ బాగుంది క‌నుక ఈ సినిమా రిజ‌ల్ట్ పై ఎటువంటి అనుమానాలే లేవు.నాగ్ రూపంలో  మ‌రో అక్కినేని వ‌చ్చి సంక్రాంతి సంద‌డి చేస్తుంటే క‌నుల‌కు విందే! సినిమా విష‌యంలో నాగ్ చెప్పిన మాటే మళ్లీ అభిమానుల‌కు చెబుతున్నాం మీసం మెలేసే సినిమానే ఇది.కంగ్రాట్స్ క‌ల్యాణ్  .. కంగ్రాట్స్ నాగ్..కంగ్రాట్స్ అనూప్.. ఆఖ‌రుగా కంగ్రాట్స్ చై అండ్ కృతి ..

బంగార్రాజు సినిమా ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌యింది.అన్ని సెంట‌ర్ల‌లో ఈ సినిమా సంద‌డి నెల‌కొంది. బెనిఫిట్ షోలు లేని కార‌ణంగా ఆంధ్రావ‌నిలో ఉద‌యం 11 గంట‌ల‌కే మార్నింగ్ షో ప‌డ‌నుంది.అయితే మిగ‌తా ప్రాంతాల‌లోబెనిఫిట్ షో ఉండ‌డంతో సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర సంగ‌తులు హెరాల్డ్ మీడియా మోసుకువ‌స్తోంది ప్ర‌త్యేకంగా మీకోసం. ఈ సినిమా క‌థ మొత్తం

సోగ్గాడే చిన్ని నాయ‌న‌కు కొనసాగింపుగానే ఉంటుంది.బంగార్రాజు క్యారెక్ట‌ర్ కు కొన‌సాగింపు ఇస్తూనే ఆయ‌న మ‌న‌వ‌డిపాత్ర‌ను చై  రూపంలో భ‌లే తీర్చిదిద్దాడ‌ని టాక్ వ‌స్తోంది.సినిమాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంద‌ని,నాగ్ మార్క్ యాక్టింగ్,కామెడీ టైమింగ్ విప‌రీతంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు.పండుగ రోజు విడుద‌లయిన ఈ సినిమా నిజంగానే పండ‌గ‌లాంటి సినిమా అని కూడా కితాబులు వ‌స్తున్నాయి. నాగ్ కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ ను ప్రూవ్ చేసే విధంగానే ఈ సినిమా ఉంద‌ని తెలుస్తోంది.

పంచెక‌ట్టులో నాగార్జున, నాగ‌చైత‌న్య ఇద్దరూ అద‌ర‌గొట్టారు. ఈ సినిమాలో అంద‌మ‌యిన భామ‌లు వారితో పెన‌వేసుకునే న‌వ్వులు ఇవ‌న్నీ కూడా చాలా బాగుంటాయి.ముఖ్యంగా నాగ్ లుక్ అదిరిపోయింది.సీనియ‌ర్ యాక్ట‌ర్ ర‌మ్య‌కృష్ణ లుక్ కూడా మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హిళ కు ప్ర‌తినిధిగా ఉంటుంది.ఈ సినిమాలో సాధార‌ణ గృహిణిగా ఉన్నా  పాత్ర ప‌రంగా అల‌రిస్తుంది.సినిమాప‌రంగా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునే రూపొందించార‌ని,నాగ్ కానీ చై కానీ న‌టించిన తీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్, వ‌ల్గారిటీ లేని డైలాగ్ ఇవ‌న్నీ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లే! ముఖ్యంగా మ‌నం ఫేమ్ అనూప్ అందించిన సంగీతం భ‌లే ఉంది. సంగీత‌మే కాదు నేప‌థ్య సంగీతం కూడా చాలా అంటే చాలా బాగుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: